AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: అమ్మవారికి భక్తుడి విచిత్ర కోరిక.. చీటిలో ఏం రాశాడో చూడండి..

గుడికి వెళ్లినప్పుడు ఎవరైనా ఏం కోరుకుంటారు? తమకు కష్టాలు రాకుండా చూడాలని.. అప్పులు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా కాపాడాలని దేవుడిని వేడుకుంటారు. కోరికలు తీరితే మొక్కులు చెల్లించుకుంటామని మొక్కుకుంటారు. కానీ ఇక్కడ ఓ భక్తుడు కోరిన కోరిక తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు. అదేమిటో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Viral News: అమ్మవారికి భక్తుడి విచిత్ర కోరిక.. చీటిలో ఏం రాశాడో చూడండి..
Devotees Viral Plea To Goddess For Bed Bug Removal
Anand T
|

Updated on: Nov 07, 2026 | 7:50 AM

Share

కర్ణాటకలో ఓ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ భక్తుడు అమ్మవారిని వింత కోరిక కోరాడు. సాధారణంగా చాలామంది తమ ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని దేవుడిని ప్రార్థిస్తే.. ఈ భక్తుడు మాత్రం తమ ఇంట్లోని నల్లులు (నల్లులు) బాధ నుంచి విముక్తి కల్పించాలని వేడుకున్నాడు. తాజాగా ఆలయ హుండీ లెక్కింపు చేపట్టడంతో ఈ విషయం బయటపడింది.

వివరాల్లోకి వెళ్తే.. కర్ణాటకలోని శక్తి దేవత సవదత్తి ఎల్లమ్మ ఆలయంలో ఇటీవల హుండీల లెక్కింపు చేపట్టారు. ఈ క్రమంలో హుండీలోని నోట్లను లెక్కిస్తున్న సమయంలో సిబ్బందికి ఓ భక్తుడు రాసిన చీటి కనిపించింది. దానిపై రాసి ఉన్న మాటలను చూసి సిబ్బంది ఆశ్చర్యపోయారు.

ఆ చీటీలో భక్తుడు.. అమ్మా తల్లీ ఎల్లమ్మ దేవీ.. మా ఇంట్లో నల్లుల బాధ ఎక్కువైంది. దయచేసి వాటిని ఇంటి నుంచి వెళ్లగొట్టమ్మా” అని వేడుకున్నాడు. తన కోరిక నెరవేరితే మళ్లీ ఆలయానికి వచ్చి పండ్లు, కాయలు సమర్పించి పూజలు చేసుకుంటానని రాసుకొచ్చాడు.

ఈ చీటిని చూసిన ఆలయ సిబ్బంది ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ చీటిని చూసిన నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. కొందరు.. పాపం, ఎంత కష్టం వచ్చిందో అంటూ సరదాగా కామెంట్స్ చేస్తుండగా.. మరికొందరు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. శక్తి దేవత సవదత్తి ఎల్లమ్మ ఆలయానికి భక్తులు భారీగా కానుకలు సమర్పించారు. ఈసారి హుండీ ఆదాయాన్ని లెక్కించేందుకు ఏకంగా నాలుగు రోజుల సమయం పట్టింది. మొత్తం రూ.2.69 కోట్ల కానుకలు అమ్మవారికి అందాయని దేవాదాయ శాఖ అధికారులు వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us