AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP DSC 2026 నోటిఫికేషన్‌లో 2,721 టీచర్ పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ ఇదే!

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. డీఎస్సీ-2026 ద్వారా మొత్తం 2,721 టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబర్ 11 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. డిసెంబర్ 20 నుంచి జనవరి 13 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించనున్నారు..

AP DSC 2026 నోటిఫికేషన్‌లో 2,721 టీచర్ పోస్టులు.. పరీక్షల షెడ్యూల్ ఇదే!
AP DSC Notification
Srilakshmi C
|

Updated on: Nov 07, 2026 | 7:10 AM

Share

ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ-2026 నోటిఫికేషన్‌ను నవంబర్ 5న విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,721 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు నవంబర్ 11 నుంచి 30 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా డిసెంబర్ 20, 2026 నుంచి జనవరి 13, 2027 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు (CBT) నిర్వహించనున్నారు. అభ్యర్థుల సౌకర్యార్థం డిసెంబర్ 5న ఆన్‌లైన్ మాక్ టెస్ట్ నిర్వహించనున్నారు. డిసెంబర్ 14 నుంచి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం కల్పించనున్నారు. డీఎస్సీ-2026 ద్వారా వివిధ యాజమాన్యాలు, విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు..

  • జనరల్ పాఠశాలలు (SA, SGT): 2,111 పోస్టులు
  • ప్రత్యేక విద్య (SA, SGT): 350 పోస్టులు
  • సొసైటీలు, ఇతర యాజమాన్యాలు (ప్రిన్సిపల్, PGT, TGT, PD, PET): 260 పోస్టులు

పోస్టుల వారీగా విద్యార్హతలు

  • డీఎస్సీ-2026లో పోస్టును బట్టి విద్యార్హతలు మారుతాయి. అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకునే పోస్టుకు సంబంధించిన అర్హతలను తెలుసుకోవాలి.
  • ఎస్జీటీ (SGT): ఇంటర్మీడియట్‌తో పాటు డీఎడ్ లేదా డీఎల్ఈడీ వంటి సంబంధిత ఉపాధ్యాయ శిక్షణ అర్హత ఉండాలి. నిర్దేశించిన టెట్ అర్హత కూడా అవసరం.
  • స్కూల్ అసిస్టెంట్ (SA): సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు బీఈడీ పూర్తి చేసి ఉండాలి. నోటిఫికేషన్‌లో పేర్కొన్న టెట్ అర్హత తప్పనిసరి.
  • పీజీటీ (PGT): సంబంధిత సబ్జెక్టులో పోస్టు గ్రాడ్యుయేషన్‌తో పాటు బీఈడీ లేదా నోటిఫికేషన్‌లో పేర్కొన్న సమాన అర్హతలు ఉండాలి.
  • టీజీటీ (TGT): సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతో పాటు బీఈడీ, నిర్దేశించిన టెట్ అర్హత అవసరం.
  • ప్రిన్సిపల్: సంబంధిత విభాగంలో పీజీ, బీఈడీతో పాటు నోటిఫికేషన్‌లో పేర్కొన్న పని అనుభవం, ఇతర అర్హతలు ఉండాలి.
  • పీడీ / పీఈటీ (PD/PET): శారీరక విద్యకు సంబంధించిన నిర్దేశిత విద్యార్హతలు కలిగి ఉండాలి.

అర్హత కలిగిన అభ్యర్థులు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి డీఎస్సీ-2026 నోటిఫికేషన్‌ను పరిశీలించాలి. అనంతరం ఆన్‌లైన్ దరఖాస్తులో అవసరమైన వివరాలను నమోదు చేసి, సంబంధిత ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. డీఎస్సీ పోస్టుల వారీగా విద్యార్హతలు, వయోపరిమితి, టెట్ అర్హతలు, ఇతర నిబంధనల్లో మార్పులు ఉండవచ్చు. కాబట్టి దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి అధికారిక నోటిఫికేషన్‌ను జాగ్రత్తగా పరిశీలించాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ విడుదల: నవంబర్ 5, 2026
  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 11, 2026
  • దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 30, 2026
  • ఆన్‌లైన్ మాక్ టెస్ట్: డిసెంబర్ 5, 2026
  • హాల్‌టికెట్ల డౌన్‌లోడ్: డిసెంబర్ 14, 2026 నుంచి
  • కంప్యూటర్ ఆధారిత పరీక్షలు: డిసెంబర్ 20, 2026 నుంచి జనవరి 13, 2027 వరకు

ఏపీ డీఎస్సీ-2026 టీచర్ ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us