AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. నవంబర్ 24 వరకు దరఖాస్తులకు అవకాశం!

నిరుద్యోగులకు బ్యాంక్ ఆఫ్ బరోడా శుభవార్త అందించింది. వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన 837 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 4 నుంచి 24, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి డిగ్రీతో పాటు 3 నుంచి 12 ఏళ్ల పని అనుభవం అవసరం..

డిగ్రీ అర్హతతో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 837 ఉద్యోగాలు.. నవంబర్ 24 వరకు దరఖాస్తులకు అవకాశం!
Bank Of Baroda Recruitment
Srilakshmi C
|

Updated on: Nov 07, 2026 | 6:32 AM

Share

బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు శుభవార్త. ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంకుకు చెందిన వెల్త్ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (WMS) విభాగంలో ఒప్పంద ప్రాతిపదికన మొత్తం 837 పోస్టులను భర్తీ చేయనుంది. అర్హత, సంబంధిత పని అనుభవం ఉన్న అభ్యర్థులు నవంబర్ 4 నుంచి నవంబర్ 24, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం ఐదు విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు..

  • గ్రూప్ హెడ్ – అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్-II పోస్టుల సంఖ్య: 8
  • హెడ్ ఇన్వెస్ట్‌మెంట్ – అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్-II పోస్టుల సంఖ్య: 1
  • టెరిటరీ హెడ్ – అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్-I పోస్టుల సంఖ్య: 35
  • ఇన్వెస్ట్‌మెంట్ ప్రొడక్ట్ మేనేజర్ – అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్-I పోస్టుల సంఖ్య: 2
  • సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ – డిప్యూటీ మేనేజర్ పోస్టుల సంఖ్య: 791

అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పోస్టును బట్టి మేనేజ్‌మెంట్‌లో పీజీ డిగ్రీ లేదా డిప్లొమా, ఎంబీఏ (ఫైనాన్స్/మార్కెటింగ్/బ్యాంకింగ్), సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ (CFP), చార్టర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (CFA) వంటి అదనపు అర్హతలకు ప్రాధాన్యత ఉంటుంది. కొన్ని పోస్టులకు NISM, IRDAI ధ్రువపత్రాలు తప్పనిసరి. అంతేకాకుండా వెల్త్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్, బ్రోకింగ్ లేదా ఆర్థిక సేవల రంగాల్లో పోస్టును బట్టి 3 నుంచి 12 ఏళ్ల వరకు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయోపరిమితి నవంబర్ 1, 2026 నాటికి పోస్టును బట్టి 50 ఏళ్ల వరకు ఉండాలి. ఇతర వయోపరిమితి సడలింపులు ఉంటే అధికారిక నోటిఫికేషన్ ప్రకారం వర్తిస్తాయి. అర్హత కలిగిన అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించి Careers విభాగంలో సంబంధిత రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను ఎంపిక చేసుకోవాలి. సూచించిన వివరాలను నమోదు చేసి, అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తు ఫీజు చెల్లించాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులు రూ.850, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు రూ.175 చొప్పున ఫీజు చెల్లించవల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపికకు విద్యార్హతలు, పని అనుభవాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. అవసరాన్ని బట్టి ఆన్‌లైన్ రాత పరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, ఇంటర్వ్యూ నిర్వహించే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్‌ 4, 2026.
  • దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్‌ 24, 2026.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలకు ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us