AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CBSE Exam Date: సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలు వచ్చేశాయి.. ఎప్పనుంచంటే?

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సీబీఎస్ఈ 10వ మరియు 12వ తరగతి బోర్డు పరీక్షలు 2027 ఫిబ్రవరి 16న జరగనున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. 2027 బోర్డు పరీక్షల కోసం లక్షలాది మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు.

CBSE Exam Date: సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షల తేదీలు వచ్చేశాయి.. ఎప్పనుంచంటే?
Cbse Board Exams 2027
Balaraju Goud
|

Updated on: Nov 06, 2026 | 7:49 PM

Share

న్యూఢిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. సీబీఎస్ఈ 10వ మరియు 12వ తరగతి బోర్డు పరీక్షలు 2027 ఫిబ్రవరి 16న జరగనున్నాయి. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి, 12వ తరగతి బోర్డు పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది. 2027 బోర్డు పరీక్షల కోసం లక్షలాది మంది విద్యార్థులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల తేదీల పట్టిక (Date Sheet 2027) కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2027 ఫిబ్రవరి 16 నుంచి పరీక్షలు ప్రారంభమవుతాయి. 10వ తరగతి బోర్డు పరీక్షలు మార్చి 9న, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఏప్రిల్ 9న ముగుస్తాయి. 2027లో సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలకు సుమారు 46 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారు.

2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రాక్టికల్ పరీక్షలు, ప్రాజెక్ట్ వర్క్, ఇంటర్నల్ అసెస్‌మెంట్ల నిర్వహణపై CBSE మార్గదర్శకాలు జారీ చేసింది. సాధారణ పాఠశాలల్లో ప్రాక్టికల్ పరీక్షలు 2027 జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. శీతాకాల ప్రాంతాల్లోని పాఠశాలలకు ప్రత్యేక షెడ్యూల్ వర్తిస్తుంది.

డేట్‌షీట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి?

విద్యార్థులు CBSE అధికారిక వెబ్‌సైట్ https://www.cbse.gov.in/ ను సందర్శించాలి. వెబ్‌సైట్‌లో Examination Circulars విభాగాన్ని తెరిచి, Class 10 లేదా Class 12 Date Sheet 2027 లింక్‌పై క్లిక్ చేసి PDF డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

పూర్తి CBSE 10వ తరగతి , 12వ తరగతి తేదీల పట్టికను ఇక్కడ చూడండి:

మరిన్ని కెరీర్ & ఉద్యోగ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us