కర్ణాటక సంక్షోభంలో క్షణక్షణం

కర్ణాటకలో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిరోజు దుంఖాన్ని దిగమింగుకుని పాలన చేస్తున్నానని..ఇటీవల బాధపడ్డ సీఎం కుమార స్వామికి నిజంగా కన్నీరు మిగిల్చే సంఘటనలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్,జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఎనిమిది మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలతో నేరుగా గవర్నర్ విజుభాయ్ వాలా వద్దకే వెళ్లి తాజా పరిణామాలపై మాట్లాడారు. ఇదిలా ఉంటే రాజీనామా పత్రాలను ఇచ్చేందుకు స్పీకర్ వద్దకు వెళ్లగా అక్కడ ఆయన […]

కర్ణాటక సంక్షోభంలో  క్షణక్షణం
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 06, 2019 | 6:48 PM

కర్ణాటకలో రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రతిరోజు దుంఖాన్ని దిగమింగుకుని పాలన చేస్తున్నానని..ఇటీవల బాధపడ్డ సీఎం కుమార స్వామికి నిజంగా కన్నీరు మిగిల్చే సంఘటనలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్,జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో ఎనిమిది మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ ఎమ్మెల్యేలు మొత్తం 11 మంది రాజీనామా చేశారు. తమ రాజీనామా పత్రాలతో నేరుగా గవర్నర్ విజుభాయ్ వాలా వద్దకే వెళ్లి తాజా పరిణామాలపై మాట్లాడారు. ఇదిలా ఉంటే రాజీనామా పత్రాలను ఇచ్చేందుకు స్పీకర్ వద్దకు వెళ్లగా అక్కడ ఆయన అందుబాటులో లేకపోవడంతో వాటిని కార్యాలయంలోనే ఇచ్చారు. తాను ఆ సమయంలో అందుబాటులో లేనని.. అయితే తాను ఈ విషయాన్ని సోమవారం పరిశీలిస్తానని మీడియాతో చెప్పారు స్పీకర్ రమేశ్ కుమార్.

అయితే తాజా పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఎత్తులు వేస్తోంది బీజేపీ. ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం పడిపోతే వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రెడీ అవుతోంది. కర్ణాటకలో సింగిల్ లార్జెస్ట్ పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆపార్టీ సీనియర్ నేత సదానంద గౌడ వ్యాఖ్యానించారు. ఒకవేళ గవర్నర్ ఆహ్వానిస్తే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మరోవైపు బీజేపీ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే యడ్యూరప్పే ముఖ్యమంత్రిగా ఉంటారని తెలిపారు సదానంద గౌడ. కర్ణాటకలో మొత్తం 224 స్థానాలు ఉండగా బీజేపీ 105, కాంగ్రెస్‌ 78, జేడీఎస్‌ 37, బీఎస్పీ 1, ఇతరులు 2 ఉన్నాయి. గతంలో ఇద్దరు, ఇప్పుడు 11 మంది సంకీర్ణ కూటమికి చెందిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కుమారస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఒకవేళ స్పీకర్ రాజీనామలను ఆమోదిస్తే ప్రభుత్వం కూలిపోతుంది. అప్పుడు సహజంగానే బీజేపీ అధికారంలోకి వచ్చే వీలుంది.