Kargil Vijay Diwas 2023: చనిపోయాడనుకున్నారు.. కట్ చేస్తే, చరిత్ర సృష్టించాడు.. కార్గిల్ హీరో డీపీ సింగ్ గురించి తెలుసా?

|

Jul 26, 2023 | 8:44 AM

Devender Pal Singh: జీవితంలో కొన్ని సంఘటనలు ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఒకసారి మరణించి మళ్లీ బ్రతికి అంగవైకల్యంతో ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధించి మళ్లీ ఎందరికో ఆదర్శంగా నిలిచారు..

Kargil Vijay Diwas 2023: చనిపోయాడనుకున్నారు.. కట్ చేస్తే, చరిత్ర సృష్టించాడు.. కార్గిల్ హీరో డీపీ సింగ్ గురించి తెలుసా?
Kargil Vijay Diwas 2023
Follow us on

Devender Pal Singh: జీవితంలో కొన్ని సంఘటనలు ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఒకసారి మరణించి మళ్లీ బ్రతికి అంగవైకల్యంతో ఆత్మవిశ్వాసంతో విజయాలు సాధించి మళ్లీ ఎందరికో ఆదర్శంగా నిలిచారు.. అతడే కార్గిల్ యుద్ధ వీరుడు రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ దేవేందర్ పాల్ సింగ్. భారత్ పాకిస్తాన్ ల మధ్య జరిగిన కార్గిల్ యుద్ధం 1999 సంవత్సరంలో మే 3న మొదలై జులై 26న ముగిసింది. అందుకే జూలై 26న విజయ్ దివస్ గా దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. కార్గిల్ యుద్ధంలో అమరులైన వీరుల జ్ఞాపకార్థం కార్గిల్ వార్ మెమోరియల్ ను లడక్ సమీపంలోని ద్రాస్ టౌన్ లో ఏర్పాటు చేశారు. జులై 26 కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ప్రత్యేక కథనం..

కార్గిల్ యుద్ధం..

భారత్ శత్రు దేశమైన పాకిస్తాన్ 1998-99 ఏడాదిలో శీతాకాలం LOC నియంత్రణ రేఖ దాటి మనదేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్ లో అనేక ఎత్తైన ప్రదేశంలో ఆక్రమించింది. కార్గిల్ శ్రీనగర్ ను కలిపే జాతీయ రహదారుతోపాటు లడక్ ప్రాంతాన్ని కొంతమేర ఆక్రమించింది. పాకిస్తాన్ దళాలు ఆదిపత్యం చెలాయించే ప్రయత్నం చేశాయి. ఈ ప్రాంతాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆపరేషన్ విజయ్ ప్రారంభించింది. రెండు పూర్తిస్థాయి అణు దేశాలైన భారత్ పాకిస్తాన్ల మధ్య యుద్ధం రెండు నెలలపాటు కొనసాగి తీవ్ర ప్రతిస్తంభనకు దారి తీసింది. యుద్ధాన్ని నివారించడానికి యూఎస్ఏ అధ్యక్షుడు బిల్ క్లింటన్ జోక్యం చేసుకోవడంతో ఆయన సూచన మేరకు పాకిస్తాన్ దళాలు ఉపసంహరించుకున్నాయి. దీంతో కార్గిల్ యుద్ధం జూలై 26న ముగిసింది.

కార్గిల్ హీరో దేవేంద్ర పాల్ సింగ్..

కార్గిల్ యుద్ధంలో ఎంతోమంది అమరులయ్యారు.. కానీ రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ దేవేంద్ర పాల్ సింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. దేవేంద్ర పాల్ సింగ్ హర్యానా రాష్ట్రంలో జగదారి అనే టౌన్ లో జనవరి 13 1974 లో పుట్టారు. అయితే అఫీషియల్ రికార్డ్స్ ప్రకారం..1973 సెప్టెంబర్ 13 గా నమోదయింది. కార్గిల్ యుద్ధంలో భీకర యుద్ధ పోరాటంలో పాకిస్తానీ మిలిటరీ నుండి కాల్పుల సమయంలో DP సింగ్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడ్డాడు. శరీరంలోని అనేక శరీర భాగాలకు తీవ్ర గాయాలై యుద్ధ వీరునిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ వైద్యులు దేవేంద్ర పాల్ సింగ్ మరణించినట్లుగా ప్రకటించారు. అప్పుడే ఒక మ్యాజిక్ జరిగింది ఆర్మీ హాస్పిటల్ లోని వైద్యులు అతన్ని తిరిగి బ్రతికించడంలో సక్సెస్ అయ్యారు. శరీరంలోని ఎన్నో భాగాలకు సీరియస్ గాయాలు అయినప్పటికీ బ్రతికి బయటపడ్డారు. అయితే ఆయన తన కుడికాలును కోల్పోవడం జరిగింది.

ఇవి కూడా చదవండి

రియల్ హీరో రిటైర్డ్ మేజర్ దేవేంద్ర పాల్ సింగ్..

జూలై 15 1999 దేవేంద్ర పాల్ సింగ్ తన కొత్త జీవితాన్ని ప్రారంభించారు. తన కాలును కోల్పోయిన ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. కృత్రిమంగా అమర్చిన బ్లేడుతో నడకను ప్రారంభించారు. తరవాత పరుగులు తీశారు. ఇండియన్ బ్లేడ్ రన్నర్ గా ఫేమస్ అయ్యాడు. వివిధ ప్రమాదాల్లో, యుద్ధాల్లో శరీర భాగాలు కోల్పోయిన వారికి ఆత్మస్థైర్యం నింపడానికి అరుదైన మార్గాన్ని ఎంచుకున్నాడు. స్పిరిట్ ఆఫ్ అడ్వెంచర్ పేరుతో స్కై డైవ్ నిర్వహించారు.

బహుశా ఇదేనేమో ఆత్మస్థైర్యానికి నిలువెత్తు అద్దం రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ దేవేంద్ర పాల్ సింగ్ కు గ్రేట్ సెల్యూట్.. ప్రతి సంవత్సరం జూలై 26 కార్గిల్ దివస్ (కార్గిల్ విక్టరీ డే) జరుపుకుంటున్నాం..

మరిన్ని జాతీయ వార్తల కోసం..