బీజేపీ మహిళా అభ్యర్థిపై కమల్ నాథ్ అనుచిత వ్యాఖ్య.. ఇక రచ్ఛ మొదలు
కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన ఓ మహిళపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన ఓ వ్యాఖ్య వివాదాస్పదమైంది. డాబ్రాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన..
కాంగ్రెస్ పార్టీ నుంచి ఇటీవల బీజేపీలో చేరిన ఓ మహిళపై మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన ఓ వ్యాఖ్య వివాదాస్పదమైంది. డాబ్రాలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో మాట్లాడిన ఆయన.. ఇమ్రతీ దేవి అనే ఈ మహిళా అభ్యర్థిని ‘ఐటెమ్’ గా వ్యాఖ్యానించారు. తమ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ చాలా నిరాడంబరమైన వ్యక్తి అయితే ఈమె మాత్రం ఐటమ్ అన్నారు. (మధ్యప్రదేశ్ లో 28 స్థానాలకు వచ్ఛేనెల 3 న ఉపఎన్నికలు జరగనున్నాయి). కాగా- కమల్ నాథ్ వ్యాఖ్యకు మండిపడిన సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, తను సోమవారం ఉదయం పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు మౌన దీక్ష చేసి నిరసన తెలుపుతానన్నారు. ఇమ్రతీ దేవి ఓ పేద రైతు కూతురని, ఎమ్మెల్యే కావడానికి అనువుగా జీవితంలో ఆమె ఎదగాలనుకుంటోందని ఆయన అన్నారు. అటు-ఇమ్రతీ దేవి కూడా కమల్ నాథ్ పై దూషణల పర్వం ప్రారంభించింది. పేద కుటుంబంలో పుట్టడం తన తప్పు కాదని, కమల్ నాథ్ పై ..ఒక తల్లి అయిన కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీకి ఫిర్యాదు చేస్తానని ఆమె పేర్కొంది. మధ్యప్రదేశ్ లో చాలామంది బీజేపీ నేతలు కమల్ నాథ్ ని దుయ్యబట్టారు.
మధ్యప్రదేశ్ ఉప ఎన్నికల ఫలితాలను వచ్ఛే నెల 10 న ప్రకటించనున్నారు.