Meghlaya Election 2023: కేజీ టు పీజీ వరకు ఫ్రీ.. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..

ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందజేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు బీజేపీ చీఫ్ నడ్డా. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు చెల్లించే మొత్తాన్ని 2000 రూపాయలు పెంచుతామని..

Meghlaya Election 2023: కేజీ టు పీజీ వరకు ఫ్రీ.. ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా..
JP Nadda
Follow us

|

Updated on: Feb 15, 2023 | 1:25 PM

మేఘాలయ రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. సంకల్ప్ పత్రంలో మేఘాలయ ప్రజలకు హామీ వర్షం కురిపించారు. ఇందులో 7వ పే కమిషన్‌ను అమలు చేస్తామని, ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందజేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు బీజేపీ చీఫ్ నడ్డా. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు చెల్లించే మొత్తాన్ని 2000 రూపాయలు పెంచుతామని.. ఆడపిల్ల పుట్టినప్పుడు 50 వేల రూపాయల బాండ్ ఇస్తామంటూ హామీ ఇచ్చారు నడ్డా. అంతే కాదు బాలికలకు కిండర్ గార్టెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ఉచిత విద్యను అందిస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.

మేనిఫెస్ట్ విడుదల చేసిన అనంతరం స్థానికంగా జరిగిన ఓ సభలో ప్రసంగించారు. రాజధాని షిల్లాంగ్‌లో  జేపీ నడ్డా మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాఫియా పాలనలో పనిచేస్తోందన్నారు. మత ప్రాతిపదికన టీఎంసీ రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. మత ప్రాతిపదికన విభజించి టీఎంసీ రాజకీయాలు చేయబోతోందని.. ఇతర దేశాల నుంచి కూడా పిలిపించి ఓట్లు దండుకునే పనిలో టీఎంసీ నాయకులు ఉన్నారని నడ్డా ఆరోపించారు.

ఇక్కడి సంస్కృతిని అంతం చేసింది కూడా వీరే. అదే సమయంలో కాంగ్రెస్‌పై కూడా ఆయన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులకు దోచుకోవడానికి అధికారం మాత్రమే కావాలన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో బీజేపీ దేశాన్ని అభివృ‌ద్ధి దిశగా తీసుకెళ్తుంటే.. కాంగ్రెస్ పార్టీ కేవలం రాజకీయాలు చేస్తుందని నడ్డా మండిపడ్డారు.

ఈ నెల ద్వితీయార్థంలో ఎన్నికలు జరగనున్న మూడు ఈశాన్య రాష్ట్రాలలో మేఘాలయ ఒకటి. మేఘాలయ, నాగాలాండ్‌లకు ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. త్రిపురలో ఫిబ్రవరి 16న పోలింగ్ జరగనుంది. ఈ మూడు రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ మార్చి 2న జరగనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోెసం