Badrinath: ప్రమాదం అంచున బద్రీనాథ్ ఆలయం? సింహ ద్వారంలో పగుళ్లు.. ల్యాండ్ స్లైడింగ్ వల్లే ఇలా
జోషిమఠంలోని పరిస్థితి బద్రీనాథ్‌లో లేదని హెచ్‌ఎన్‌బీ గర్వాల్ యూనివర్సిటీ జియాలజీ విభాగం అధిపతి ఎంపీఎస్ బిష్త్ అన్నారు. దీనికి కారణం రెండూ వేర్వేరు భౌగోళిక నిర్మాణాలపై నెలకొని ఉండడమేనని చెప్పారు. బద్రీనాథ్ ఆలయ సింహద్వారం పగుళ్లు రావడానికి కొన్ని స్థానిక కారణాలు ఉండవచ్చని ఆయన అన్నారు. దీనిని జోషిమఠంతో ముడిపెట్టడం సరికాదన్నారు.

జోషిమఠ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటన ఇంకా మరచిపోకముందే.. ఇప్పుడు బద్రీనాథ్ ఆలయానికి ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బద్రీనాథ్ ఆలయ సింహ ద్వారానికి పగుళ్లు వచ్చాయి. వారం రోజుల క్రితం ఈ పగుళ్లు కనిపించాయి. అయితే ఈ సమాచారం సామాన్యులకు తెలియకుండా ఉంచినట్లు.. జోషిమఠ్‌కు కేవలం 40 కి.మీ దూరంలోనే భూమి కుంగిపోయిందన్న వార్తలతో కలకలం రేగింది. పురావస్తు శాఖ అధికారులు వెంటనే బద్రీనాథ్ లోని ఘటనాస్థలిని పరిశీలించి మరమ్మతులు చేపట్టారు.
ఈ ఏడాది జనవరి నెలలో ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో కొండచరియలు విరిగిపడినప్పుడు వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. ఏఎస్‌ఐ అధికారులు ఒక బృందం ఘటనా స్థలానికి చేరుకొని అధ్యయనం చేశారు. ఈ బృందం సిద్ధం చేసిన నివేదిక.. కొండచరియలు విరిగిపడానికి కారణం భారీ వర్షాలు, పర్యావరణ కారణాల వల్ల సంభవించాయని వెల్లడించింది. బద్రీనాథ్ ఆలయంలోని సింహ ద్వారంలో పగుళ్లు రావడానికి కూడా ఇవే కారణాలను ఏఎస్‌ఐ పేర్కొంది.
దీంతో ఏఎస్సై సంఘటనా స్థలాన్ని పరిశీలించి మరమ్మతు పనులు ప్రారంభించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. డెహ్రాడూన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఆర్కియాలజిస్ట్ మనోజ్ సక్సేనా ద్వారం వద్ద ఏర్పడినవి చిన్న పగుళ్లు మాత్రమే నని పెద్దగా భయపడాల్సిన పనిలేదని పేర్కొన్నారు. గోడకు అమర్చిన ఇనుప చట్రాన్ని మార్చే పనిని ఏఎస్‌ఐ బృందం ప్రారంభించిందని తెలిపారు. ఈ ఏర్పాటుతో రాళ్ల కీళ్లు బలపడతాయి. అదేవిధంగా ఉత్తరాఖండ్ టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్ కూడా ఈ విషయంపై స్పందిస్తూ.. ఇవి చిన్న పగుళ్లు అని అన్నారు. ల్యాండ్ స్లైడింగ్ వల్లే ఇలా జరిగిందని చెప్పారు.




బద్రీనాథ్ ద్వారం వద్ద మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని.. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఆలయ సింహద్వారం నిర్మాణం ఆలయ నిర్మాణంలో భాగం కాదని.. దీనిని ప్రత్యేకంగా నిర్మించామని చెప్పారు. అందువల్ల సింహద్వారం పగుళ్లు రావడంతో ఆలయ నిర్మాణానికి ముప్పు వాటిల్లుతుందని తాము భావించడం లేదన్నారు. సింహ ద్వారం నిర్మాణం కూడా 17వ శతాబ్దానికి చెందినదని, ఇది ఆలయ సముదాయంలో భాగమని ఆయన చెప్పారు. నిర్మాణంలో కొన్ని దేవుళ్ల విగ్రహాలు, చిహ్నాలు కూడా ఉన్నాయి.
మరోవైపు జోషిమఠంలోని పరిస్థితి బద్రీనాథ్‌లో లేదని హెచ్‌ఎన్‌బీ గర్వాల్ యూనివర్సిటీ జియాలజీ విభాగం అధిపతి ఎంపీఎస్ బిష్త్ అన్నారు. దీనికి కారణం రెండూ వేర్వేరు భౌగోళిక నిర్మాణాలపై నెలకొని ఉండడమేనని చెప్పారు. బద్రీనాథ్ ఆలయ సింహద్వారం పగుళ్లు రావడానికి కొన్ని స్థానిక కారణాలు ఉండవచ్చని ఆయన అన్నారు. దీనిని జోషిమఠంతో ముడిపెట్టడం సరికాదన్నారు. అదేవిధంగా సంఘటనా స్థలాన్ని పరిశీలించిన తరువాత ASI అధికారులు సింహ ద్వారంలోని ఇనుప బిగింపులను ఏర్పాటు చేసి ఉండవచ్చనని పేర్కొన్నారు.
గోడలలోకి నీరు చేరడంతో వాటి పట్టు బలహీనంగా మారడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తే అవకాశం ఉంది. ఈ గేటును 30 ఏళ్ల క్రితం పునరుద్ధరించినట్లు చెప్పారు. అప్పటి నుంచి ఈ పరిస్థితి ఇప్పుడు తొలిసారిగా కనిపించింది. మరమ్మతు పనుల్లో భాగంగా గేట్‌కు అమర్చిన రాళ్లన్నింటినీ మార్చామని.. అవి వాటి స్థలం నుండి మారాయని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..