AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jawaharlal Nehru University : టర్కీకి షాక్‌ ఇచ్చిన జేఎన్‌యూ.. కీలక ఒప్పందం నిలిపివేత!

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్‌ పేరుతో పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్‌ దాడి చేసిన తర్వాత పాకిస్తాన్‌కు టర్కీ మద్దతు ఇవ్వడంపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈక్రమంలో జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా టర్కీకి చెందిన ఇనోను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) రద్దు చేసుకుంది. ఈ విషయాన్ని జేఎన్‌యూ తన ఎక్స్‌ ఖాతా ద్వారా తెలియజేసింది.

Jawaharlal Nehru University : టర్కీకి షాక్‌ ఇచ్చిన జేఎన్‌యూ.. కీలక ఒప్పందం నిలిపివేత!
Jnu
Anand T
|

Updated on: May 14, 2025 | 10:12 PM

Share

జాతీయ భద్రతా పరిగణనల కారణంగా టర్కిష్ విశ్వవిద్యాలయంతో తమ అవగాహన ఒప్పందాన్ని నిలిపివేసినట్లు జవహర్‌లాల్ నెహ్రూ ప్రధాన విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. జేఎన్‌యూ వెబ్‌సైట్‌ ప్రకారం.. టర్కీలోని ఇనోను విశ్వవిద్యాలయం, జేయోన్‌యూ మధ్య 2025 ఫిబ్రవరి 3వ తేదీన అవగాహన ఒప్పందం జరిగింది. అయితే ఈ ఒప్పందం 2028 ఫిబ్రవరి 2 వరకు మూడేళ్ల పాటు  అమల్లో ఉండాలని షెడ్యూల్‌ చేయబడింది. అయితే ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్టు బుధవారం జేఎన్‌యూ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్ చేసింది.

జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఇనోను విశ్వవిద్యాలయంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం నిలిపివేయబడుతుందని జేఎన్‌యూ స్పష్టం చేసింది.

అయితే భారత్‌కు వ్యతిరేకంగా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తుందనే ఆరోపణలతో టర్కీకి చెందిన వార్తా ప్రసార సంస్థ “TRT వరల్డ్” ఎక్స్‌ ఖాతాలను భారత ప్రభుత్వం కొంతకాలం నిలిపి వేసింది. అయితే అదే రోజు జేఎన్‌యూ కూడా టర్కీకి చెందిన యూనివర్సిటీలో ఒప్పందాన్ని నిలిపివేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..