Love: పేషెంట్ కూతరుపై కన్నేసిన డాక్టర్.. పెళ్లి పేరుతో రెండేళ్ల పాటు ఎంజాయ్.. చివరకు ఆ విషయం తెలియడంతో..

ఒడిశాలోని భుశనేశ్వర్‌లో దారుణం వెలుగు చూసింది. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుని నిర్వాకం వెలుగు చూసింది. వైద్యం కోసం వచ్చిన రోగి కూతురుపై కన్నేసిన ఆ డాక్టర్.. పెళ్లి పేరుతో యువతిని నమ్మించి..

Love: పేషెంట్ కూతరుపై కన్నేసిన డాక్టర్.. పెళ్లి పేరుతో రెండేళ్ల పాటు ఎంజాయ్.. చివరకు ఆ విషయం తెలియడంతో..
Doctor Arrested
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 19, 2022 | 8:12 PM

ఒడిశాలోని భుశనేశ్వర్‌లో దారుణం వెలుగు చూసింది. ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుని నిర్వాకం వెలుగు చూసింది. వైద్యం కోసం వచ్చిన రోగి కూతురుపై కన్నేసిన ఆ డాక్టర్.. పెళ్లి పేరుతో యువతిని నమ్మించి మోసం చేశాడు. రెండేళ్లపాటు అమ్మాయితో శారీరక సంబంధం కొనసాగించిన అతను.. వేరే అమ్మాయితో పెళ్లి సెట్ అవడంతో.. ఈమెకు గుడ్ బై చెప్పాడు. దాంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. రంగంలోకి దిగిన పోలీసులు.. కీచక వైద్యుడికి బుద్ధి చెప్పి కటకటాల వెనక్కి పంపారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఒడిశాలోని భువనేశ్వర్‌లో రెండేళ్ల క్రితం ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం రోగి వచ్చాడు. అతనికి ఓ కూతురు(26) కూడా ఉంది. అయితే, సదరు రోగికి ఆల్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(ఎయిమ్స్)లో పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థి చికిత్స అందించాడు. ఈ క్రమంలో ఆ డాక్టర్ కన్ను రోగి కూతురుపై పడింది. యువతి తండ్రిని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసే సమయంలో ఆమె ఫోన్ నెంబర్ తీసుకున్నాడు. ఆ తరువాత ఫోన్ చేసి మాట కలిపాడు. తనకు నచ్చావంటూ, ఒప్పుకుంటే జీవితాంతం కలిసి ఉంటానంటూ ప్రేమ పాఠాలు వల్లించాడు. ఆ కీచక వైద్యుడి లోగుట్టుని పసిగట్టలేకపోయిన యువతి.. అతని మాటలను నమ్మేసింది. అతను ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్లింది. రెండేళ్ల పాటు యువతితో శారీరక సంబంధం కొనసాగించాడు. ఇంతలో అతని స్వరాష్ట్రమైన పశ్చిమబెంగాల్‌లో మరో యువతితో పెళ్లి ఫిక్స్ అయ్యింది. బాధితురాలికి తెలియకుండా నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ప్రేమ పేరుతో శారీరక సంబంధం కొనసాగించిన యువతిని వదిలేసే ప్రయత్నం చేశాడు. అయితే, విషయం తెలుసుకున్న బాధిత యువతి.. తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. అయితే అతను మొఖం చాటేశాడు.

దాంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. తాను మోసపోయిన విధానాన్ని పోలీసులకు వివరించింది. కంప్లైంట్ ఇచ్చింది. బాధిత యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న భువనేశ్వర్-కటక్ పోలీసులు.. కీచక వైద్యుడిని అరెస్ట్ చేశారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ కొనసాగుందని పోలీసులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..