Traffic Rules : జీబ్రాను ఫాలో అవుతున్న జింక..! జీవితం చాలా విలువైది గురూ! ట్రాఫిక్‌ పోలీసుల ట్వీట్‌ వైరల్‌

|

May 20, 2022 | 5:43 PM

ప్రస్తుతమంతా సోషల్‌ మీడియా ట్రెండ్‌ కొనసాగుతోంది. ఎలాంటి ప్రచారం, అవగాహన కార్యక్రమాలకైనా సోషల్ మీడియా ఓ అద్భుత ప్లాట్‌ఫామ్‌గా మారింది. ఇందులో భాగంగానే తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తరచూగా సోషల్‌ మీడియాను వాడేసుకుంటూ...

Traffic Rules : జీబ్రాను ఫాలో అవుతున్న జింక..! జీవితం చాలా విలువైది గురూ! ట్రాఫిక్‌ పోలీసుల ట్వీట్‌ వైరల్‌
Deer Zindagi
Follow us on

ప్రస్తుతమంతా సోషల్‌ మీడియా ట్రెండ్‌ కొనసాగుతోంది. ఎలాంటి ప్రచారం, అవగాహన కార్యక్రమాలకైనా సోషల్ మీడియా ఓ అద్భుత ప్లాట్‌ఫామ్‌గా మారింది. ఇందులో భాగంగానే తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తరచూగా సోషల్‌ మీడియాను వాడేసుకుంటూ…ప్రగతి చక్రాలను పరుగులు పెట్టించే పనిలోపడ్డారు. అటు పోలీస్‌ శాఖవారు కూడా రోడ్డు భద్రత నియమాలను సోషల్‌ మీడియా ద్వారానే ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. ఇందులో భాగంగానే ఉత్తరప్రదేశ్ పోలీసులు ఓ ఇన్‌ట్రెస్టింగ్‌ వీడియోని షేర్‌ చేశారు. అది చూసిన నెటిజన్లు, వాహనదారులు భిన్నమైన కామెంట్లు పెడుతున్నారు. జీబ్రా క్రాసింగ్ వద్ద జింక వీడియోతో రోడ్డు భద్రతపై వినూత్న రీతిలో అవగాహన పెంచుతున్నారు యూపీ పోలీసులు. రోడ్డు భద్రత గురించి ప్రజలను హెచ్చరించడానికి ఓ సృజనాత్మక వీడియోను షేర్ చేశారు. దీనికి ‘డీర్ జిందగీ’ అని ట్యాగ్ లైన్‌ ఇచ్చారు.

యూపీ పోలీసులు షేర్‌ చేసిన ఈ వీడియోలో జీబ్రా క్రాసింగ్ వద్ద ఓ జింక కనిపించింది. ఆ సమయంలో వాహనాల రద్దీ కొనసాగుతోంది. దాంతో ఆ జింక అక్కడే ఆగి ఎదురుచూసింది. ఇంతలో రెడ్ సిగ్నల్ పడింది. రోడ్డుపై వెళ్తున్న వాహనాలు ఆగిపోయాయి. అప్పుడు మాత్రమే ఆ జింక రోడ్డు దాటింది. జీబ్రా క్రాసింగ్‌పై మెల్లగా నడుస్తూ రోడ్డు దాటింది. ఈ దృశ్యాన్ని ఓ వ్యక్తి వీడియో రికార్డ్ చేశారు. ఆ వీడియో క్లిప్‌ని షేర్ చేశారు యూపీ పోలీసులు. “‘డీర్ జిందగీ’. జీవితం విలువైనది, ప్రాణం అమూల్యమైనది, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం మంచిది కాదు. ! అని వీడియోకి ట్యాగ్‌లైన్‌ ఇచ్చారు. ఈ వీడియోని ఇప్పటివరకూ 33 వేల మందికి పైగా వీక్షించారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని పోలీసు శాఖ ప్రజలను కోరిన విధానాన్ని నెటిజన్లు ఎంతగానో ప్రశంసిస్తున్నారు. “చివరకు మనం జంతువుల ద్వారా ఇలాంటివి నేర్చుకోవాల్సి వస్తోందంటూ మరికొందరు నెటిజన్లు ట్వీట్‌ చేశారు. మొత్తానికి వీడియో మాత్రం నెట్టింట దూసుకుపోతోంది.

ఇవి కూడా చదవండి