Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్లో స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు కూలీలకు గాయాలు..

జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గామ్‌లోని మజామా ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ కార్మికులు జల్ జీవన్ ప్రాజెక్ట్‌లో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఉత్తరప్రదేశ్ వాసులుగా చెబుతున్నారు.

Jammu and Kashmir: జమ్మూ కశ్మీర్లో స్థానికేతరులే లక్ష్యంగా ఉగ్రవాదుల దాడి.. ఇద్దరు కూలీలకు గాయాలు..
Migrant Workers Shot By Terrorists In J&k
Follow us
Surya Kala

|

Updated on: Nov 02, 2024 | 7:11 AM

జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలోని మగామ్‌లోని మజమా ప్రాంతంలో శుక్రవారం స్థానికేతరులపై ఉగ్రవాదులు మళ్లీ దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. గాయపడినవారు కూలీలు గుర్తించారు. ఇద్దరూ ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌కు చెందినవారు.

దాడి తర్వాత గాయపడిన ఇద్దరినీ వెంటనే శ్రీనగర్‌లోని జెవిసి బెమీనా ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. గాయపడిన ఇద్దరినీ సోఫియాన్ (25), ఉస్మాన్ మాలిక్ (25)లుగా గుర్తించారు. సోఫియాన్, ఉస్మాన్ కార్మికులు జలశక్తి శాఖలో రోజువారీ కూలీగా పనిచేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరూ ఉత్తరప్రదేశ్ వాసులు. జిల్లాలో ప్రభుత్వ జల్‌ జీవన్‌ ప్రాజెక్టులో కూలీగా పనిచేస్తున్నాడు. సంఘటనా స్థల ప్రాంతమంతా చుట్టుముట్టిన ఆర్మీ దళాలు, పోలీసు సిబ్బంది అనుమానిత ఉగ్రవాదులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

గందర్‌బల్‌లో ఏడుగురి హత్య తర్వాత మరో దాడి జరిగింది

రెండు వారాల క్రితం కేంద్ర పాలిత ప్రాంతంలోని గందర్‌బల్ జిల్లాలో ఏడుగురు వ్యక్తులు మరణించారు.. అనేకమంది గాయపడ్డారు. ఈ దాడి జరిగిన సుమారు 15 రోజుల తర్వాత మళ్ళీ స్థానికేతరులపై ఈ దాడి జరిగింది.

దాడి జరిగిన సమయంలో కార్మికులు సొరంగంలో పని చేస్తున్నారు. ఆ సమయంలో గందర్‌బాల్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిలో డాక్టర్‌తో సహా మొత్తం ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడిని కేంద్ర ప్రభుత్వం, కొత్తగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఖండించాయి.

జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఈ దాడి జరిగింది. గందేర్‌బల్ సీఎం ఒమర్ అబ్దుల్లా అసెంబ్లీ నియోజకవర్గం. ఈ దాడి ద్వారా ఉగ్రవాదులు మళ్లీ భీభత్సం సృష్టించాలనుకున్నారు.

ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో నివసిస్తున్న స్థానికేతరులను, ప్రభుత్వ ఉద్యోగులు, ఆర్మీ సిబ్బందిని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఉగ్రవాదుల ఈ చర్యకు లక్ష్య హత్యగా పేరు పెట్టారు. జమ్మూ కాశ్మీర్ వెలుపలి ప్రజల్లో భయాందోళనలు సృష్టించడమే ఉగ్రవాదుల లక్ష్యంగా తెలుస్తోంది. అయితే ఉగ్రవాదుల ఉద్దేశాలను ఫలించబోమని కేంద్ర ప్రభుత్వం, జమ్మూకశ్మీర్‌కు కొత్తగా ఎన్నికైన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో శాంతి, ప్రశాంతత నెలకొనేందుకు తనవంతు కృషి చేస్తానని జమ్మూ కాశ్మీర్ ప్రజలకు హామీ ఇచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..