Diwali: హర్యానాలో దీపావళి జరుపుకున్న పాక్ మాజీ మంత్రి.. రెండు దేశాల ప్రజలకు ఆనందాన్ని ఇవ్వాలని అల్లాని కోరిన రెహమన్ ఖాన్

హర్యానాలో దీపావళి జరుపుకున్నారు పాకిస్థాన్ మాజీ మంత్రి. చౌతాలా పార్టీకి హాజరైన ఈ సందర్భంగా కంజు మాట్లాడుతూ.. మేము సరిహద్దుల్లో జీవిస్తున్నాం.. మా సంతోషంలో, దుఃఖంలో అభయ్, ఓపీ చౌతాలా ఎప్పుడూ మా వెంటే ఉన్నారు. కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలకు స్వాగతం పలికేందుకు ఈ పార్టీ ఏర్పాటు చేయబడింది.. ఈ కార్యక్రమంలో పాకిస్థాన్ మాజీ మంత్రి పాల్గొన్నారు. ఈ పార్టీలో INLD అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా కూడా ఉన్నారు.

Diwali: హర్యానాలో దీపావళి జరుపుకున్న పాక్ మాజీ మంత్రి.. రెండు దేశాల ప్రజలకు ఆనందాన్ని ఇవ్వాలని అల్లాని కోరిన రెహమన్ ఖాన్
Ex Pakistan Minister Abdul Rehman Khan Kanju
Follow us

|

Updated on: Nov 02, 2024 | 10:23 AM

హర్యానాలో పాకిస్థాన్ మాజీ మంత్రి అబ్దుల్ రెహమాన్ ఖాన్ కంజు దీపావళి వేడుకలు జరుపుకున్నారు. దీపావళి పండగ సందర్భంగా ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నాయకుడు అభయ్ చౌతాలా ఇచ్చిన పార్టీకి ఆయన హాజరయ్యారు. వాస్తవానికి కొత్తగా ఎన్నికైన ఇద్దరు ఎమ్మెల్యేలకు స్వాగతం పలికేందుకు ఈ పార్టీ ఏర్పాటు చేయబడింది.. ఈ వేడుకలో కంజు పాల్గొన్నారు. ఈ పార్టీలో INLD అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాష్ చౌతాలా కూడా ఉన్నారు.

ఇటీవల జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో అభయ్ సింగ్ చౌతాలా కుమారుడు అర్జున్ చౌతాలా, మాజీ ముఖ్యమంత్రి దివంగత దేవిలాల్ మనవడు ఆదిత్య దేవిలాల్ వరుసగా రానియా, దబ్వాలి స్థానాల నుంచి గెలుపొందారు. ఈ కార్యక్రమంలో ఆదిత్య, అర్జున్‌లు పాల్గొన్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన ఆదిత్య, అర్జున్‌లకు పాకిస్థాన్ మాజీ మంత్రి అబ్దుల్ రెహమాన్ ఖాన్ కంజు అభినందనలు తెలిపారు.

అభయ్ చౌతాలా హర్యానా సింహం.. కంజు

ఇవి కూడా చదవండి

ఈ సందర్భంగా బ్దుల్ రెహమాన్ ఖాన్ కంజు మాట్లాడుతూ దీపావళి ప్రత్యేక సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించిందన్నారు. మేము సరిహద్దుల దగ్గర జీవిస్తున్నాము, మా సంతోషంలో దుఃఖంలో అభయ్ , చౌతాలా ఎల్లప్పుడూ మాకు అండగా తోడునీడగా నిలిచారని చెప్పారు. అభయ్ హర్యానా సింహం. దీపావళి చీకటిని తరిమికొట్టే వెలుగుల పండుగ.. రెండు దేశాల ప్రజలకు ఆనందాన్ని ప్రసాదించాలని అల్లాను ప్రార్థిస్తున్నామని చెప్పారు రెహమాన్ ఖాన్ కంజు.

కంజుకి ధన్యవాదాలు తెలిపిన అభయ్ చౌతాలా

అదే సమయంలో అభయ్ చౌతాలా తన స్వగ్రామమైన చౌతాలా భూమిలో నిన్న సాయంత్రం ప్రియమైన ఆదిత్య దేవి లాల్ కి, అర్జున్ సింగ్ చౌతాలాక్కు స్వాగత వేడుకను నిర్వహించినందుకు గ్రామస్తులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని చెప్పారు. ఈ ప్రత్యేక సందర్భంలో పాకిస్థాన్‌కు చెందిన ఎంపీ అబ్దుల్ రెహమాన్ సాహెబ్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు గ్రామస్తులకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు అభయ్ చౌతాలా.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..