- Telugu News Photo Gallery Green tea: These Mistakes You Should Stop Making To Get The Best Benefits Of Green Tea
Green Tea: శీతాకాలంలో గ్రీన్ టీ తాగడం మంచిదే.. తాగే సమయంలో ఈ తప్పులు చేస్తే అనారోగ్యానికి వెల్కం చెప్పినట్లే..
గ్రీన్ టీని ఔషధ గుణాల నిధిగా పరిగణిస్తున్నారు. అయితే దానిని ఎప్పుడు, ఎలా తాగాలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. అలాగే రోజూ తాగితే ఏమవుతుందనే ప్రశ్న కూడా జనాల మదిలో మెదులుతోంది. ఆయుర్వేద నిపుణుల నుండి ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోండి.. గ్రీన్ టీ తాగే సమయంలో మీరు చేసే కొన్ని పొరపాట్లకు దూరంగా ఉండవచ్చు.
Updated on: Nov 02, 2024 | 9:38 AM

ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల నిద్రలేమి, మైగ్రేన్ వంటి సమస్యలకు దారితీసే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎముకల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. గ్రీన్ టీలో ఉండే కెఫిన్ మైగ్రేన్ నొప్పికి కారణమవుతుంది. గ్రీన్ టీని ఎక్కువగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతినే అవకాశాలు కూడా పెరుగుతాయి. గ్రీన్ టీ ఎక్కువగా తీసుకోవడం వల్ల చర్మానికి అలర్జీ వస్తుంది.

గ్రీన్ టీ ఎక్కువగా తాగే వారిలో ఉదర సమస్యలు ఏర్పడతాయి. కడుపులో మంట, యాసిడ్ రిఫ్లక్స్ సహా అనేక చికాకులు వస్తాయి. మరీ ముఖ్యంగా ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగే వారిలో ఈ సమస్యలు ఎక్కువగా ఎదుర్కొవాల్సి వస్తుంది. కాబట్టి మనం దానిని తక్కువగా తీసుకోవాలి.

నిపుణులు ఏమని చెప్పారంటే.. జైపూర్‌కు చెందిన ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా టీవీ9తో ప్రత్యేక సంభాషణలో గ్రీన్ టీ గురించి చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. గ్రీన్ టీ వంటివి తాగే ముందు శరీర స్థితిగతులకు అనుగుణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఎవరి స్వభావంలోనైనా వాత లేదా కఫ దోషాలు ఉన్నట్లు అయితే.. ఈ గ్రీన్ టీ వినియోగం అతనికి ప్రయోజనకరంగా ఉంటుంది. చలికాలంలో దీన్ని తాగడం మంచిది. అయితే పొరపాటున కూడా ఎక్కువ మోతాదులో తాగవద్దని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ తప్పులు చేయవద్దు.. గ్రీన్ టీని వేసవిలో ఎక్కువగా తాగడం వల్ల ముక్కు నుంచి రక్తం లేదా ఆరోగ్యానికి ఇతర హాని కలుగుతుందని ఆయుర్వేద నిపుణులు తెలిపారు.

గ్రీన్ టీలో టానిన్లు ఉంటాయి. ఇది దంత సమస్యలను కలిగిస్తుంది. అంతే కాదు గ్రీన్ టీ తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. మరీ ముఖ్యంగా మోతాదుకు మించి గ్రీన్ టీ తాగే వారిలో ఫ్లోరోసిస్ సమస్య తలెత్తుతుంది. దీని వల్ల మన దంతాలు, ఎముకలు మొదటగా రంగు మారిపోతాయి. తరువాత క్రమంగా బలహీన పడిపోతాయి.

కొంతమంది రోజు మొత్తంలో టీ, కాఫీలతో పాటు గ్రీన్ టీని తాగుతుంటారు. ఆయుర్వేద నిపుణులు ఈ అలవాటును పెద్ద తప్పుగా పేర్కొన్నారు. ఇలా చేయడం వల్ల శరీరానికి లాభానికి బదులు హాని కలుగుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే కడుపు ఉబ్బరం, ఎసిడిటీ వంటి జీర్ణ సమస్యలున్నవారు పొరపాటున కూడా గ్రీన్ టీని తాగకూడదు. ఇలా చేయడం వల్ల పొట్ట ఆరోగ్యం పాడవుతుంది. ఇండిజేషన్ ఉన్న వ్యక్తులు గ్రీన్ టీకి దూరంగా ఉండాలి.

గ్రీన్ టీ తాగితే ఏమవుతుందంటే.. గ్రీన్ టీ తాగే విషయంలో సరైన విషయాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ టీని తీసుకుంటే.. అతిపెద్ద ప్రయోజనం మన బరువు నిర్వహణలో ఉంటుందని నిపుణులు చెప్పారు. జీవక్రియను పెంచడం ద్వారా కడుపు ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపగలుగుతారు. ఎందుకంటే పొట్ట ఆరోగ్యం బాగోలేకపోతే శరీరం రోగాలకు నిలయంగా మారుతుంది.

శరీరానికి కావాల్సిన పోషకాల్లో ఐరన్ అతి ముఖ్యమైనది. అయితే గ్రీన్ టీని పరిమితికి మించి తాగటం వల్ల శరీరం ఐరన్ శోషణలో ఇబ్బందులు తలెత్తుతాయి. ఎందుకంటే గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ ఉంటాయి. ఇవి మనం శరీరం ఐరన్‌ను శోషించుకోకుండా అడ్డుకుంటాయి. ఫలితంగా మనలో రక్తహీనత ఏర్పడుతుంది. అందుకే పరగడుపున కాకుండా, ఆహారంతోపాటే గ్రీన్ టీ తీసుకోవడం మంచిది.

గ్రీన్ టీలో ఉండే కెఫిన్ కారణంగా అతిగా తాగడం వల్ల శరీరంలో డీహైడ్రేషన్ వచ్చే అవకాశం ఉంది. అలాగే గ్రీన్ టీలోని టానిన్లు వాంతులు, వికారాన్ని కలిగించవచ్చు. ఫలితంగా కడుపులో మంట, గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా గ్రీన్ టీ తాగడం వల్ల మీ రక్తపోటు కూడా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.




