AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amaran Movie Review : అమరన్ మూవీ ఫుల్ రివ్యూ.. గుండెను తడిపే సినిమా

మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా శివ కార్తికేయన్ హీరోగా నటించిన సినిమా ‘అమరన్’. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మించారు. రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన అమరన్ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Amaran Movie Review : అమరన్ మూవీ ఫుల్ రివ్యూ.. గుండెను తడిపే సినిమా
కానీ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటం, ఇప్పటికీ హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌ వస్తుండటంతో నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌ను వాయిదా వేయించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళ్‌తో పాటు తెలుగు, హిందీలోనూ అమరన్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: |

Updated on: Nov 02, 2024 | 8:32 AM

Share

మూవీ రివ్యూ: అమరన్

నటీనటులు : శివ కార్తికేయన్, సాయి పల్లవి, భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లూ తదితరులు..

సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్

సినిమాటోగ్రఫీ: సి.హెచ్. సాయి

ఎడిటర్: కలైవనన్

నిర్మాతలు: ఉలగనాయగన్ కమల్ హాసన్, ఆర్. మహేంద్రన్

దర్శకుడు: రాజ్‌కుమార్‌ పెరియసామి

మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా శివ కార్తికేయన్ హీరోగా నటించిన సినిమా ‘అమరన్’. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మించారు. రాజ్ కుమార్ పెరియసామి తెరకెక్కించిన అమరన్ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

కథ:

మేజర్ ముకుంద్ వరదరాజన్ (శివ కార్తికేయన్) చిన్నప్పటి నుంచి ఆర్మీలో చేరాలనుకుంటాడు. దేశం కోసం ఏదైనా చేయాలని కలలు కంటుంటాడు. అందుకే కుటుంబానికి ఇష్టం లేకపోయినా ఆర్మీ వైపు అడుగులు వేస్తాడు ముకుంద్. కాలేజ్ లైఫ్‌లో ఉన్నపుడు ముకుంద్ వరదరాజన్ జీవితంలోకి వస్తుంది ఇందు రెబెక్కా వర్గీస్‌ ( సాయి పల్లవి). మతాలు వేరైనా.. ఇంట్లో పట్టుబట్టి మరీ ఒప్పిస్తుంది. ముకుంద్ వరదరాజన్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత ఓ పాప పుడుతుంది. ఆ తర్వాత ఆర్మీకి వెళ్ళిపోతాడు ముకుంద్. అక్కడ అతడి జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆ తర్వాత ఏం జరిగింది.. ముకుంద్ దేశం కోసం ఏం చేసాడు అనేది మిగిలిన కథ..

కథనం:

ఒక మనిషికి కన్నీళ్లు అంత ఈజీగా రావు.. అలా రావాలంటే ఏదైనా ఎమోషన్ కి గట్టిగా కనెక్ట్ అవ్వాలి. అమరన్ సినిమా చూసిన తర్వాత ఇదే ఫీలింగ్ కలిగింది. ఒక రకమైన ఎమోషన్ తో గుండె బరువెక్కింది. దేశం కోసం ప్రాణం ఇచ్చే ప్రతి సైనికుడి కథ ఆదర్శమే. అలాంటి ఓ వీర సైనికుడు ముకుంద్ వరదరాజన్. ఆయన జీవితాన్ని కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు రాజ్ కుమార్ పెరియ సామి.. సినిమా మేకింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. బహుశా ఇండియాలో వచ్చిన సోల్జర్స్ బయోపిక్స్ లో అమరన్ ది బెస్ట్. కథ మొత్తం కాశ్మీర్ లోనే జరుగుతుంది. అక్కడి పరిస్థితులను.. ప్రతీరోజూ సైనికులు పడుతున్న కష్టాలను అద్భుతంగా చూపించాడు దర్శకుడు. ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్ లోని 44 RR (రాష్ట్రీయ రైఫిల్స్ 44) గురించి చాలా బాగా చూపించారు. అమరన్ సినిమాకు ఎమోషన్స్ కీలకం.. చాలా సన్నివేశాలు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. ఒకవైపు అద్భుతమైన ఆర్మీ యాక్షన్ ఎపిసోడ్స్.. మరోవైపు ఫ్యామిలీ డ్రామా.. అద్భుతంగా బ్యాలెన్స్ చేశాడు రాజ్ కుమార్ పెరియ సామి. మేజర్ ముకుంద్ వరదరాజన్ గౌరవాన్ని 100 రెట్లు పెంచే సినిమా ఇది. ఫస్టాఫ్ లవ్ స్టోరీతో గడిచినా.. కీలకమైన సెకండాఫ్ ఎమోషన్స్ తో కంటతడి పెట్టిస్తుంది. సినిమా అంతా ఒకెత్తు అయితే చివరి అరగంట మరో ఎత్తు. దేశ భద్రతలో రాష్ట్రీయ రైఫిల్స్ పాత్రను అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు. అలాగే ఫస్టాఫ్‌లో ముకుంద్ జీవితంలో జరిగిన సంఘటనలను కూడా చక్కగా చూపించాడు. మరీ ముఖ్యంగా శివకార్తికేయన్, సాయి పల్లవి మధ్య లవ్ ట్రాక్ అద్భుతంగా వర్కవుట్ అయింది. చాలా న్యాచురల్‌గా నటించారు ఇద్దరూ. ఆ తర్వాత కూడా ఈ ఇద్దరి సీన్స్ ఎప్పుడొచ్చినా చాలా ఎమోషనల్‌గా అనిపించాయి.

నటీనటులు:

ముకుంద్ పాత్రలో శివ కార్తికేయన్ అద్భుతంగా నటించాడనే మాట చాలా చిన్నది అవుతుంది. ఇక సాయి పల్లవి గురించి ఏం చెప్పాలి..? తన మొహం మాత్రమే కాదు.. కళ్ళు, చూపులు, కన్నీళ్లు అన్నీ నటించాయి. ఆయనతో పాటు భువన్ అరోరా, రాహుల్ బోస్, లల్లూ, శ్రీకుమార్ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.

టెక్నికల్ టీం:

అమరన్ సినిమాకు టెక్నికల్ టీం ప్రాణం. జీవి ప్రకాశ్ కుమార్ చాలా అందమైన మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే అమరన్ సినిమాకి ప్రాణం సినిమాటోగ్రఫీ. ఈ విషయంలో సిహెచ్ సాయికి నూటికి నూరు మార్కులు పడతాయి. ఇక ఎడిటింగ్ కూడా చాలా బాగా కుదిరింది. 2.50 గంటల సినిమా అయినా కూడా ఎక్కడా బోర్ కొట్టదు. చివరగా దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి గురించి చెప్పాలి. ముకుంద్ కథను చాలా ఎమోషనల్‌గా చూపించాడు ఈ దర్శకుడు. ముఖ్యంగా ఆర్మీ తమ కుటుంబాన్ని ఎంత మిస్ అవుతారనేది ఈ సినిమాలో చూపించాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా అమరన్.. గుండెను తడిపే ఎమోషనల్ రోలర్ కోస్టర్..