జమ్మూ కాశ్మీర్ కి మళ్ళీ రాష్ట్ర ప్రతిపత్తిని కల్పించాలని కేంద్రం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై ప్రధాని మోదీ ఈ నెల 24 న అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ కి హాజరు కావాలని తనకు ఆహ్వానం అందిందని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ తెలిపారు. ఆ సమావేశానికి హాజరయ్యే విషయమై రేపు తమ పార్టీ నేతలతో చర్చిస్తామని ఆమె చెప్పారు. జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించడానికి ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేసి.. కాశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత అక్కడ ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి స్వస్తి చెప్పేందుకు కేంద్రం ఈ చర్య తీసుకున్నట్టు చెబుతున్నారు. ఈ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నేతలు ఈ సమావేశంలో పాల్గొనవచ్చు. కాశ్మీర్ కి రాష్ట్ర పునరుద్ధరించడంతో బాటు అక్కడ డీలిమిటేషన్ లేదా ఆయా నియోజకవర్గాల పునర్వర్గీకరణ వంటి అంశాలపై కూడా ఈ అత్యంత ప్రధానమైన సమావేశంలో చర్చించవచ్చునని తెలుస్తోంది. వచ్చే నవంబరులో గానీ లేక వచ్చే ఏడాది ఆరంభంలో గానీ జమ్మూ కాశ్మీర్ ఎన్నికలను ప్రభుత్వం నిర్వహించే అవకాశాలు ఉన్నాయి.
ఈ సమావేశానికి హాజరు కావాలని నిన్నటివరకు తొమ్మిది పార్టీలకు ఆహ్వానం అందిందని, అయితే మొత్తం 16 పార్టీలకు ఇన్విటేషన్ పంపుతారని సమాచారం. కాగా జమ్మూ కాశ్మీర్ లో రాజకీయ పక్రియ మొదలు పెట్టడానికి ఇంకా సమయం ఉందని పీపుల్స్ కాన్ఫరెన్స్ నేత సజాద్ లోనే…అప్నీ పార్టీ నాయకుడు అల్తాఫ్ బుఖారీ వ్యాఖ్యానించారు. కానీ ముఖ్యమైన నేషనల్ కాన్ఫరెన్స్ దీనిపై ఇంకా తన స్పందనను తెలియజేయలేదు. ఫరూక్ అబ్దుల్లా వంటి వారు తమ అభిప్రాయాన్ని వెల్లడించాల్సి ఉంది.
మరిన్ని ఇక్కడ చూడండి: ఎత్తిన కత్తి దించితే ఒట్టు.. అమేజింగ్ వీడియో వైరల్..!మహిళ అరుదైన ప్రతిభ :woman playing sword viral video.
Viral Video : పెళ్లి కూతురు డ్రెస్సు నుండి బయటకు వచ్చిన వ్యక్తి వైరల్ అవుతున్న వీడియో .