Watch Video: ముగ్గురు పాక్ ముష్కరులను మట్టుబెట్టిన భారత జవాన్లు.. CCTVలో రికార్డైన దృశ్యాలు..

|

Aug 26, 2022 | 4:54 PM

భారత్ లోకి ఉగ్రవాదులను పంపి ఎలాగైనా దాడులకు పాల్పడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నపాకిస్తాన్ కుట్రలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. కొద్దిరోజుల క్రితం..

Watch Video: ముగ్గురు పాక్ ముష్కరులను మట్టుబెట్టిన భారత జవాన్లు.. CCTVలో రికార్డైన దృశ్యాలు..
Jammu And Kashmir
Follow us on

Indian army: భారత్ లోకి ఉగ్రవాదులను పంపి ఎలాగైనా దాడులకు పాల్పడేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నపాకిస్తాన్ కుట్రలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతుంది. కొద్దిరోజుల క్రితం ఉగ్రవాద సంస్థల ప్రోద్భలంతో భారత్ లో దాడులకు ప్లాన్ చేస్తున్న ఓ వ్యక్తిని రష్యాలో అదుపులోకి తీసుకోగా.. తాజాగా జమ్మూ కశ్మీర్ లో పాక్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్ కమల్ కోట్ లో మడియాన్ నానక్ పోస్టు మీదుగా ముగ్గురు ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నించారు. ఈవిషయాన్ని ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా భారత ఆర్మీ గుర్తించింది. వెంటనే అప్రమత్తమైన భారత భ్రదతా బలాగాలు ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీనికి సంబంధించిన వీడియోను మీడియాకి విడుదల చేసింది.

పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు భారత భూభాగంలోకి చొరబడేందుకు యత్నిస్తారన్న నిఘావర్గాల సమాచారంతో భారత ఆర్మీ అప్రమత్తమైంది. ఎప్పటికప్పుడు సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాదుల యత్నాలను సైన్యం భగ్నం చేస్తూ వస్తోంది. ఉగ్రవాదుల కదలికలను గుర్తించడానికి భారత సైన్యానికి ఎలక్ట్రానిక్ నిఘా పరికరాలు ఉపయోగపడుతున్నాయి. ఉగ్రవాదులపై భారత సైన్యం కాల్పులు జరిపినప్పుడు దుండగులు ఎదురు కాల్పులకు దిగారు. ఈకాల్పుల్లో భారత సైనికులు ఎవరికి ఎటువంటి ప్రమాదం వాటిల్లలేదు. ఘటనా స్థలంలో రెండు ఏకే 47 రైఫిళ్లు, ఒక చైనీస్ ఎం-16 రైఫిల్, ఇరత సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..