Jammu and Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో పాకిస్థాన్ తీవ్రవాద కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ పాక్ సరిహద్దు రేఖ వెంబడి ఓ వైపు అక్రమ చొరబాట్లను ప్రోత్సహిస్తోంది. మరోవైపు ఆయుధాలను డ్రగ్స్ ను భారత దేశంలోకి స్మగ్లింగ్ చేసే ప్రయత్నాలు కొనసాగిస్తోంది. తాజాగా పాకిస్థాన్ భారీగా భారత్‌లోకి భారీగా డ్రగ్స్‌ను భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం ఉదయం.. సాంబా ప్రాంతంలో మాదకద్రవ్యాల స్మగ్లింగ్ చేసే విధంగా చొరబాటు ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలను సరిహద్దు భద్రతా దళం (BSF) విఫలం చేసింది. పాకిస్థానీ స్మగ్లర్‌పై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఒక స్మగ్లర్ గాయపడ్డాడు.. తిరిగి పాకిస్తాన్ భూభాగానికి చేరుకొని తప్పించుకున్నాడని భద్రతాదళ అధికారులు చెప్పారు. అయితే ఆ ప్రాంతం నుంచి దాదాపు 8 కిలోల మాదక ద్రవ్యాలను బీఎస్ఎఫ్ స్వాధీనం చేసుకుంది. ఇది హెరాయిన్ అని అధికారులు గుర్తించారు.
గురువారం ఉదయం, నియంత్రణ రేఖ వద్ద పెట్రోలింగ్ చేస్తున్న BSF సిబ్బంది పాకిస్తాన్ సరిహద్దు వైపు అనుమానాస్పద కార్యకలాపాలను గుర్తించాయి. వెంటనే బీఎస్ఎఫ్ కు సమాచారం అందించింది. పర్యవేక్షణ ప్రారంభించిన భద్రతాదళాలు ఓ వ్యక్తి బ్యాగ్‌తో పాకిస్థాన్ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ప్రయత్నించాడు. దీంతో బీఎస్ఎఫ్ జవాన్లు అతడిపై కాల్పులు జరిపారు.
చొరబాటుదారుడికి గాయాలు:
బీఎస్ఎఫ్ కాల్పుల్లో చొరబాటుదారుడు గాయపడ్డాడు. రక్తం కారుతున్న లెక్కచేయకుండా అతను తిరిగి పాకిస్తాన్ వైపు పరిగెత్తుకుని వెళ్ళాడు. ఈ సమయంలో అతని వద్ద ఉన్న బ్యాగ్ ను అక్కడ వదిలేశాడు. ఆ బ్యాగ్ ను భారత భద్రతాదళాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ సంచిలో 8 ప్యాకెట్ల మత్తు పదార్థాలు లభ్యమయ్యాయి. ఈ పదార్ధం హెరాయిన్ అని భావిస్తున్నారు. చొరబాటుదారుడికి బుల్లెట్ తలిగి గాయం అయింది. దీంతో రక్తం కారుతోంది. ఆ ప్రాంతంలో రక్తపు మరకలు కూడా కనిపించాయని భద్రతాదళాలు పేర్కొన్నాయి.
పాకిస్థాన్ ఉగ్రవాది అరెస్ట్:
మరోవైపు జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో పాకిస్థాన్‌కు చెందిన ఓ ఉగ్రవాది పట్టుబడ్డాడు. భారత ఆర్మీ పోస్ట్‌పై దాడి చేసినందుకు పాకిస్థాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి చెందిన కల్నల్ తనకు రూ.30,000 ఇచ్చినట్లు ఉగ్రవాది అంగీకరించాడు. పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లోని కోట్లి సబ్జాకోట్ గ్రామానికి చెందిన తబారక్ హుస్సేన్ (32)ని ఆదివారం నౌషేరా సెక్టార్‌లో అరెస్టు చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..