Jammu and Kashmir: నేడు కశ్మీర్‌లో తుది విడత పోలింగ్‌.. ఫలితాలు ఎప్పుడంటే..!

జమ్మూకశ్మీర్‌లో తుదిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్‌ సందర్భంగా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జమ్ములో 24, కశ్మీర్‌లోయలో 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 40 స్థానాల్లో మొత్తం 415 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో 50 స్థానాలకు పోలింగ్ పూర్తి అయ్యింది...

Jammu and Kashmir: నేడు కశ్మీర్‌లో తుది విడత పోలింగ్‌.. ఫలితాలు ఎప్పుడంటే..!
Follow us

|

Updated on: Oct 01, 2024 | 7:35 AM

జమ్మూకశ్మీర్‌లో తుదిదశ పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్‌ సందర్భంగా గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. జమ్ములో 24, కశ్మీర్‌లోయలో 16 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 40 స్థానాల్లో మొత్తం 415 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఇప్పటికే రెండు విడతల్లో 50 స్థానాలకు పోలింగ్ పూర్తి అయ్యింది. తొలి విడతలో 61.38, రెండో విడతలో 57.31 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

ఇప్పుడు మూడో విడతలో పోలింగ్ శాతం పెంచడంపై అధికారులు ఫోకస్ పెట్టారు. ఇవాళ్టితో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుండగా.. 90 స్థానాలకు 8న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నెల 5న సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడవుతాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు, రాష్ట్ర హోదా తర్వాత ఓటుహక్కు పొందిన పశ్చిమ పాకిస్థాన్‌ శరణార్థులు, వాల్మీకి సమాజ్, గూర్ఖా తెగలవారు ఈ ఎన్నికల్లో ఓటు వేయబోతున్నారు. మొత్తం 415 మంది అభ్యర్థులు అదృష్టం పరీక్షించుకొంటున్నారు. వీరిలో కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఉపముఖ్యమంత్రులు తారా చంద్, ముజఫర్‌ బెయిగ్‌ కూడా ఉన్నారు.

ఉత్తర కాశ్మీర్‌లోని మూడు సరిహద్దు జిల్లాల్లోని 16 అసెంబ్లీ సెగ్మెంట్లలో కట్టుదిట్టమైన భద్రత మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. బారాముల్లా, ఉరి, రఫియాబాద్, పట్టాన్, గుల్మార్గ్, సోపోర్, వాగూరా-క్రీరీ (బారాముల్లా జిల్లా), కుప్వారా, కర్నా, ట్రెహ్‌గామ్, హంద్వారా, లోలాబ్, లాంగటే (కుప్వారా జిల్లా), బందిపోరా, సోనావారి, గురేజ్ (బందీపోరా జిల్లా)లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

నేడు కశ్మీర్‌లో తుది విడత పోలింగ్‌.. ఫలితాలు ఎప్పుడంటే..!
నేడు కశ్మీర్‌లో తుది విడత పోలింగ్‌.. ఫలితాలు ఎప్పుడంటే..!
అమానుషం.. తన కూతుర్ని కరిచిందని కుక్కపై ప్రతీకారం ! ఏం చేశాడంటే..
అమానుషం.. తన కూతుర్ని కరిచిందని కుక్కపై ప్రతీకారం ! ఏం చేశాడంటే..
భారత్‌తో టీ20సిరీస్‌..బంగ్లా జట్టు ఇదే.. టీమ్‌లో డేంజరస్ ప్లేయర్
భారత్‌తో టీ20సిరీస్‌..బంగ్లా జట్టు ఇదే.. టీమ్‌లో డేంజరస్ ప్లేయర్
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. పెరిగిన సిలిండర్‌ ధర!
గ్యాస్‌ వినియోగదారులకు షాక్‌.. పెరిగిన సిలిండర్‌ ధర!
ఆదిత్యకు బిగ్‏బాస్ వార్నింగ్.. నామినేషన్లలో ఉన్నది వీరే..
ఆదిత్యకు బిగ్‏బాస్ వార్నింగ్.. నామినేషన్లలో ఉన్నది వీరే..
'ఇది నాకు పునర్జన్మ.. దేవుడికి ధన్యవాదాలు'.. సర్ఫరాజ్ సోదరుడు
'ఇది నాకు పునర్జన్మ.. దేవుడికి ధన్యవాదాలు'.. సర్ఫరాజ్ సోదరుడు
ఐసీయూలో పనిచేయని ఏసీలు..ఇలా టేబుల్‌ ఫ్యాన్లు తెచ్చుకుంటున్నరోగులు
ఐసీయూలో పనిచేయని ఏసీలు..ఇలా టేబుల్‌ ఫ్యాన్లు తెచ్చుకుంటున్నరోగులు
కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన హైదరాబాదీ పేసర్ సిరాజ్.. వీడియో చూడండి
కళ్లు చెదిరే క్యాచ్ పట్టిన హైదరాబాదీ పేసర్ సిరాజ్.. వీడియో చూడండి
అక్టోబర్‌ 1న దిగి వచ్చిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు
అక్టోబర్‌ 1న దిగి వచ్చిన బంగారం ధర.. తెలుగు రాష్ట్రాల్లో ధరలు
ఆసుపత్రిలో చేరిన రజినీకాంత్..
ఆసుపత్రిలో చేరిన రజినీకాంత్..