అమానుషం.. తన కూతుర్ని కరిచిందని కుక్కపై ప్రతీకారం ! ఏం చేశాడంటే..

కోపంతో రగిలిపోయిన పప్పు.. కుక్కను కర్రలతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆపై వేడి నిప్పులు చల్లాడు. అక్కడితో ఆగకుండా గాయపడిన కుక్కను బైక్ వెనుక తాళ్లతో కట్టి వీధుల్లో తిప్పి చివరికి బండ రాయితో కొట్టి చంపాడు. ఈ షాకింగ్‌ ఘటన సీసీ టీవీలో రికార్డయింది.

అమానుషం.. తన కూతుర్ని కరిచిందని కుక్కపై ప్రతీకారం ! ఏం చేశాడంటే..
Inhuman He Beat The Dog
Follow us

|

Updated on: Oct 01, 2024 | 7:31 AM

తన కూతురిని ఓ వీధి కుక్క కరిచిందనే కోపంతో ఓ వ్యక్తి ఆ కుక్కను అతి దారుణంగా చంపేశాడు. ఓ కుక్క ఓ బాలికను కరవడంతో ఆమె తండ్రి కుక్కపై అత్యంత క్రూరంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పప్పు అనే వ్యక్తి కూతురిని ఓ వీధి కరించింది. దీంతో కోపంతో రగిలిపోయిన పప్పు.. కుక్కను కర్రలతో విచక్షణారహితంగా కొట్టాడు. ఆపై వేడి నిప్పులు చల్లాడు. అక్కడితో ఆగకుండా గాయపడిన కుక్కను బైక్ వెనుక తాళ్లతో కట్టి వీధుల్లో తిప్పి చివరికి బండ రాయితో కొట్టి చంపాడు. మధ్యప్రదేశ్‌లోని గుణాలో జరిగిన ఈ షాకింగ్‌ ఘటన సీసీ టీవీలో రికార్డయింది.

జరిగిన దారుణంపై పోలీసులకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. పప్పు చేసిన దారుణానికి పోలీసులే షాక్ తిన్నారు. వెంటనే అతన్ని అరెస్ట్ చేశారు. అతనిపై జంతు హింస కేసు నమోదు చేశారు.

విచారణ కొనసాగుతుండగా, స్థానిక జంతు హక్కుల కార్యకర్తలు నిరసనలను ప్లాన్ చేస్తున్నారు, కఠినమైన శిక్షలు మరియు జంతు క్రూరత్వం గురించి మరింత అవగాహన కోసం ఒత్తిడి చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..