Terrorist Attack: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. టూరిస్టులపై కాల్పులు.. ఐదుగురు మృతి..
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు.. ప్రముఖ టూరిస్ట్ స్పాట్ పహల్‌గామ్‌లో పర్యాటకులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పల్లో 10 మందికి పైగా గాయాలయ్యాయి. ఒకరు మృతి చెందారు. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు.. ప్రముఖ టూరిస్ట్ స్పాట్ పహల్‌గామ్‌లో పర్యాటకులను టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఐదుగురు మరణించారు. 10 మందికి పైగా గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతుననారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి భారీగా భద్రతా బలగాలు చేరుకున్నాయి. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం ఆ ప్రాంతాన్ని భద్రతా బలగాలు జల్లెడపడుతున్నాయి. పహల్‌గామ్‌లో అమర్‌నాథ్ యాత్రికుల బేస్ క్యాంప్ ఉంటుంది. ఇప్పటికే అమర్‌నాథ్ యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యింది. ఇదే సమయంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడం తీవ్ర కలకలం రేపింది.
ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడ్డ ఓ మహిళా టూరిస్ట్ సమాచారం ఇవ్వడంతో కాల్పుల ఘటన గురించి అధికారులకు సమాచారం అందింది. ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులతో పాటు స్థానికులకు కూడా గాయాలైనట్టు తెలుస్తోంది..
సౌదీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఈ ఘటన గురించి తెలియగానే.. హోంమంత్రి అమిత్ షాకు ఫోన్ చేసి వివరాలను అడిగితెలుసుకున్నారు. ఉగ్రదాడి ఘటనపై హోంశాఖ ఆధ్వర్యంలో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశానికి పిలుపునిచ్చారు.
పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. దాడికి పాల్పడినవారు.. జంతువులు క్రూరులు.. ధిక్కారానికి అర్హులు అంటూ పేర్కొన్నారు. ఖండించడానికి కూడా మాటలు సరిపోవంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.
#WATCH | Firing incident reported in Pahalgam, J&K; Police and Security Forces present on the spot
Details awaited. pic.twitter.com/Ev9HXFjZZ7
— ANI (@ANI) April 22, 2025
జమ్ముకశ్మీర్ లోని కొన్ని ప్రాంతాల్లో అసలు ఉగ్రవాదుల జాడ ఉండదు.. పహల్‌గామ్ కూడా అందులో ఒకటి.. ఇక్కడికి దేశ విదేశాల నుంచి టూరిస్టులు తరలివస్తుంటారు.. మార్చిలో భారీగా మంచు కురియడంతో ఆ ప్రాంతానికికి భారీగా టూరిస్టులు తరలివచ్చారు. ట్రెక్కింగ్ వెళ్లిన టూరిస్టులను టార్గెట్ చేస్తూ ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ముగ్గురు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్టు ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు. ఈ దాడి వెనుక లష్కర్ ఉగ్రవాదుల హస్తమున్నట్టు అనుమానిస్తున్నారు. బైసరీన్ వ్యాలీని చూసేందుకు వచ్చిన వాళ్లను టెర్రరిస్టులు టార్గెట్ చేశారు. ఏడుగురు ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఉగ్రవాదుల కాల్పుల్లో గుజరాత్ , మహారాష్ట్ర , కర్నాటక , తమిళనాడు, ఒడిశాకు చెందిన పర్యాటకులకు గాయాలయ్యాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




