AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొమ్మిది నెల‌ల త‌ర్వాత తెరుచుకున్న పూరీ జ‌గ‌న్నాథ్ ఆల‌యం.. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ భ‌క్తుల‌కు అనుమ‌తి

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలోని ఆల‌యాలు సైతం మూత‌ప‌డ్డాయి. దేశంలో లాక్‌డౌన్ త‌ర్వాత అన్‌లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా ప‌లు ఆల‌యాలు తెరుచుకోగా, పూరీలోని జగ‌న్నాథ్...

తొమ్మిది నెల‌ల త‌ర్వాత తెరుచుకున్న పూరీ జ‌గ‌న్నాథ్ ఆల‌యం.. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ భ‌క్తుల‌కు అనుమ‌తి
Subhash Goud
|

Updated on: Dec 23, 2020 | 1:47 PM

Share

క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా దేశంలోని ఆల‌యాలు సైతం మూత‌ప‌డ్డాయి. దేశంలో లాక్‌డౌన్ త‌ర్వాత అన్‌లాక్ ప్ర‌క్రియ‌లో భాగంగా ప‌లు ఆల‌యాలు తెరుచుకోగా, ఒడిశాలోని పూరీలోని జగ‌న్నాథ్ ఆల‌యం భ‌క్తుల ద‌ర్శ‌నాల‌ను సైతం నిలిచివేశారు. క‌రోనా నేప‌థ్యంలో తొమ్మిది నెల‌ల సుదీర్ఘ విరామం అనంత‌రం భ‌క్తుల సంద‌ర్శ‌నార్థం బుధ‌వారం నుంచి తెరుచుకుంది. కానీ కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ఆల‌యాన్ని తెరిచిన‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. ముందుగా కొన్ని రోజుల పాటు పూరీ స్థానికుల‌కే ద‌ర్శ‌న సౌక‌ర్యం క‌ల్పించిన‌ట్టు తెలిపారు. నూత‌న సంవ‌త్స‌రాన్ని పుర‌స్క‌రించుకుని అధిక సంఖ్య‌లో వ‌చ్చే భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని జ‌న‌వ‌రి 1,2వ తేదీల్లో ఆల‌యాన్ని భ‌క్తుల సంద‌ర్శ‌నార్థం మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. జ‌న‌వ‌రి 3వ తేదీ నుంచి ద‌ర్శ‌నానికి భ‌క్తుల‌కు అనుమ‌తి ఉంటుంద‌ని చెప్పారు. భ‌క్తులు కోవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌కుండా పాటిస్తూ ఆల‌యానికి రావాల్సిందిగా ఆల‌య నిర్వాహ‌కులు సూచించారు.

ప‌ర్యాట‌కుల‌ను మాత్ర‌మే కాకుండా ప్ర‌పంచ వ్యాప్త యాత్రికుల‌ను ఆక‌ర్షించే రాష్ట్రం ఒడిశా. రాష్ట్రంలో 100 ఏళ్ల‌కు పైబ‌డిన చ‌రిత్ర క‌లిగిన‌వి 8 వేల‌కుపైగా ఆల‌యాలున్నాయ‌ని చ‌రిత్ర‌కారులు చెబుతున్నారు. జ‌గ‌న్నాథ్ ఆల‌యం నేడు తెరుచుకోవ‌డంపై ప్ర‌ముఖ శాండ్ ఆర్టిస్ట్ సుద‌ర్శ‌న్ ప‌ట్నాయ‌క్ ట్విట్ట‌ర్ ద్వారా స్పందించారు. తొమ్మిది నెల‌ల అనంత‌రం ఆల‌యం తెరుచుకున్నందున భ‌క్తులు కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ ద‌ర్శ‌నం చేసుకోవాల‌ని అన్నారు. పూరీ బీచ్‌లో వేసిన జ‌గ‌న్నాథ్ ఆల‌య సాండ్ సైక‌త శిల్పాన్ని షేర్ చేశారు.