16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా

దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సరిహద్దుల్లో విధులు నిర్వరిస్తున్న సైన్యం.. అక్కడే ఘనంగా వేడుకలు చేసుకుంటుంది. లదాఖ్‌లోని భారత్-చైనా సరిహద్దుల్లో..

16 వేల అడుగుల ఎత్తులో రెపరెపలాడిన జాతీయ జెండా
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Aug 15, 2020 | 11:01 AM

దేశ వ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సరిహద్దుల్లో విధులు నిర్వరిస్తున్న సైన్యం.. అక్కడే ఘనంగా వేడుకలు చేసుకుంటుంది. లదాఖ్‌లోని భారత్-చైనా సరిహద్దుల్లో ఐటీబీపీ సైనికులు 16 వేల అడుగుల ఎత్తులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాంగాంగ్ స‌ర‌స్సు సమీపంలో ఇండో టిబెటన్‌ సరిహద్దు రక్షణ దళం.. మువ్వెన్నల జెండాను ఎగరవేసింది. అనంతరం జాతీయ జెండాను చేతపట్టుకుని మంచుకొండల్లో మార్చ్‌ ఫాస్ట్‌ నిర్వహించారు. జాతీయ గీతాలాపన చేశారు.

కాగా, గత జూన్‌ మాసంలో ఇదే ప్రాంతంలో చైనా సైన్యంతో భీకర పోరు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 21 మంది భారత సైనికులు వీరమరణం పొందారు. చైనా ముష్కర బలగాలతో ప్రత్యేక్ష యుద్ధం చేసి వీరమరణం పొందిన సైనికుల పేర్లను గ్యాలంటరీ మెడల్స్‌ కోసం ఐటీబీపీ సిఫారసు చేసింది. ఈ గాల్వాన్‌ లోయ ప్రాంతంలో ఎప్పుడూ కూడా ఇలాంటి సంఘటన చోటుచేసుకోలేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు.