కరోనా టీకాపై ప్రధాని మోదీ స్పష్టత
కరోనా వ్యాక్సిన్ డెవలప్ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
కరోనా వ్యాక్సిన్ డెవలప్ చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఇందుకోసం భారత సైంటిస్టులు రాత్రింబవళ్లూ తీవ్రంగా శ్రమిస్తున్నారని వివరించారు. 74వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుంచి జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ ఈ కామెంట్స్ చేశారు.
కోవిడ్ వ్యాక్సిన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందోనని అందరూ ఎన్నో ఆశలతో ఎదురుచూస్తున్నారని తెలిపిన ప్రధాని… సాధ్యమైనంత త్వరగా దేశంలోని ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించే ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మూడు వ్యాక్సిన్లు ట్రయిల్స్ దశలో ఉన్నాయని.. వాటిని సైంటిస్టులు ఆమోదించిన వెంటనే ఆ టీకాలను భారీస్థాయిలో ఉత్పత్తి చేయడానికి ఇండియా రెడీగా ఉందన్నారు. దీని కోసం పక్కా ప్లానింగ్ చేస్తున్నామని.. అందరికీ టీకా అందించేందుకు పటిష్ఠ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్టు మోదీ వెల్లడించారు. తమ ప్రాణాలను లెక్క చెయ్యకుండా మన పూర్వీకులు దేశానికి స్వాతంత్రాన్ని తెచ్చారని, ఈ క్రమంలో స్వాతంత్ర కోసం పోరాడుతున్న ఎన్నో దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందన్నారు.
Also Read : తెలంగాణలో అతి భారీ వర్షపాతం