AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO UVIKA: మీ పిల్లలను యంగ్ సైంటిస్ట్‪గా చూడాలని ఉందా? అయితే ఈ అవకాశాన్ని వదలొద్దు? వెంటనే దరఖాస్తు చేయండి..

సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లలో పరిశోధనలకు గానూ ప్రత్యేకంగా యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్(యువికా) కార్యక్రమాన్ని ఇస్రో నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లను కూడా ప్రారంభించింది.

ISRO UVIKA: మీ పిల్లలను యంగ్ సైంటిస్ట్‪గా చూడాలని ఉందా? అయితే ఈ అవకాశాన్ని వదలొద్దు? వెంటనే దరఖాస్తు చేయండి..
Rocket Science
Madhu
|

Updated on: Mar 21, 2023 | 5:00 PM

Share

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) మేటి ప్రయోగాలు చేస్తూ.. ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపును సంపాదించింది. అటువంటి ఇస్రో దేశంలోని బాల మేధావులను ప్రోత్సహించే క్రమంలో ఓ వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులకు ప్రత్యేక ఇంటర్న్ షిప్స్ ను అందిస్తోంది. అంతేకాక సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ లలో పరిశోధనలకు గానూ ప్రత్యేకంగా యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్(యువికా) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ లను కూడా ప్రారంభించింది. ఈ నేపథ్యంలో అసలు కార్యక్రమం ఏమిటి? రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి? వంటి వివరాలను తెలుసుకుందాం..

స్కూల్ విద్యార్థుల కోసం..

స్కూల్ విద్యార్థుల కోసం యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్‌ను ఇస్రో ప్రత్యేక చేపడుతోంది. దీన్నియువికా అని పిలుస్తారు. యువికా అంటే ‘యువ విజ్ఞాన కార్యక్రమం’ అని అర్థం. యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్స్ మార్చి 20 నుంచి ప్రారంభిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 30 వరకు కొనసాగనుంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు ఇస్రో అధికారిక పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ మే 15 నుంచి ప్రారంభమై, మే 26 వరకు కొనసాగుతుంది.

రిజిస్ట్రేషన్ ఇలా..

ఇవి కూడా చదవండి
  • ముందు ఇస్రోయువికా అధికారిక పోర్టల్ ను సందర్శించండి.
  • హోమ్ పేజీలో కింద రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • అవసరమైన వివరాలను ఎంటర్ చేయాలి. అవసరమైన డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయాలి.
  • చివరగా అప్లికేష‌‌ను సబ్‌మిట్ చేయాలి. భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ కాపీని సేవ్ చేసుకోవాలి.
  • కాగా, ఎంపికైన విద్యార్థుల మొదటి జాబితాను ఇస్రో ఏప్రిల్ 10న, రెండో జాబితాను ఏప్రిల్ 20న విడుదల చేయనుంది.

ఎంపిక ఇలా..

8వ తరగతి లేదా చివరిగా నిర్వహించిన పరీక్షలో పొందిన మార్కులు, ఆన్‌లైన్ క్విజ్‌లో పర్ఫార్మెన్స్, సైన్స్ ఫెయిర్‌లలో పాల్గొనడం, ఒలింపియాడ్ లేదా అందుకు సమానమైన పరీక్షలలో ర్యాంక్, స్పోర్ట్స్ పోటీల్లో విజేతలు, స్కౌట్స్ అండ్ గైడ్స్, గత మూడేళ్లలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ సభ్యునిగా పాల్గొనడం, గ్రామీణ ప్రాంతాల్లో చదువుకోవడం వంటి అంశాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మారిన ఢిల్లీ పరిణామాలు
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
కళ్యాణలక్ష్మి,షాదీముబారక్‌ పథకాల అమలుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్‌
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
అరెరె ఇంత కథ ఉందా.. ఆపిల్ తినేటప్పుడు మీరూ ఇదే తప్పు చేస్తున్నారా
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఏపీలోని రైతుల అకౌంట్లోకి రూ.6 వేలు.. పడేది అప్పుడే..
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఈ 4 రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది!
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
ఏడాదిలో పోగయ్యే నల్లధనంతో.. భూమ్మీద అందరికీ లాప్ టాప్ లు కొనచ్చు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
10th సర్టిఫికెట్లకు డిజిటల్‌ టచ్‌.. ఇక QR కోడ్ స్కాన్ చేస్తే చాలు
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. పర్సులోని ఈ చిన్న వస్తువులే దరిద్రానికి కారణమట!
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
వామ్మో.. నిద్రలేవగానే టీ తాగితే కడుపులో ఇంత పని జరుగుతుందా?
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం
10 సిక్సర్లు, 9 ఫోర్లు.. దులీప్ ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ విధ్వంసం