Isha Gramotsavam 2026: ఇషా గ్రామోత్సవం.. రూ.1 కోటి నగదు బహుమతులు..
భారతదేశంలోని అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవాలలో ఒకటైన ఇషా గ్రామోత్సవం 2026ను ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో 18వ సారి ఘనంగా నిర్వహించనున్నారు. సద్గురు జగ్గీ వాసుదేవ్ మార్గదర్శకత్వంలో జరుగుతున్న ఈ క్రీడా మహోత్సవంలో 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 40 వేలకుపైగా గ్రామాల నుంచి 80 వేల మందికి పైగా క్రీడాకారులు పాల్గొననున్నారు. ఖేలో ఇండియా గుర్తింపు పొందిన ఈ టోర్నమెంట్‌లో 7 వేలకుపైగా జట్లు, దాదాపు 15 వేల మంది మహిళా క్రీడాకారులు పోటీపడనుండగా, మొత్తం రూ.1 కోటి నగదు బహుమతులను అందజేయనున్నారు.

ఇషా గ్రామోత్సవం క్రీడా సంబరాలు అంబరన్నాంటనున్నాయి. భారతదేశంలోని అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవాలలో ఒకటైన ఇషా గ్రామోత్సవం.. సద్గురు జగ్గీ వాసుదేవ్ నేతృత్వంలోని ఇషా ఫౌండేషన్18వ సారి అట్టహాసంగా నిర్వహించేందుకు సన్నాహాలను ప్రారంభించింది. ఇషా గ్రామోత్సవంలో 10 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 40,000 కంటే ఎక్కువ గ్రామాల నుంచి 80,000 మందికి పైగా ఆటగాళ్ళను ఒక చోటికి తీసుకువస్తోంది. ఖేలో ఇండియా ద్వారా గుర్తింపు పొందిన ఈ సంవత్సరం టోర్నమెంట్‌లో 7వేలకుపైగా జట్లు, సుమారు 15వేల మంది మహిళా పాల్గొంటారని పేర్కొంటున్నారు.. పోటీలోని వివిధ దశలలో మొత్తం రూ.1 కోటి నగదు బహుమతులు అందజేయనున్నామని ఇషా ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈశా అవుట్‌రీచ్ – యాక్షన్ ఫర్ రూరల్ రీజువెనేషన్ కార్యక్రమం కింద అతిపెద్ద గ్రామీణ క్రీడా ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ఇషా గ్రామోత్సవం 2026 లో భాగంగా.. తమిళనాడు, కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, మహారాష్ట్ర, హర్యానా, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ .. అలాగే.. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో సంప్రాదాయ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. అర్హత కలిగిన క్రీడాకారులు isha.co/gramotsavam వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చుని వెల్లడించింది.
గ్రామీణ యువతకు ఆటల ద్వారా ఉత్సాహాన్ని నింపడం, వ్యసనాలకు దూరం చేయడం, మహిళా సాధికారత దీని ప్రధాన లక్ష్యమని ఇషా ఫౌండేషన్ తెలిపింది. ఆయా రాష్ట్రాలలో జరిగే పోటీల ద్వారా ఫైనల్స్ ను నిర్వహించనున్నారు. రాష్ట్రాలలో గెలిచిన జట్లు సెప్టెంబర్ 4-6 వరకు కోయంబత్తూరులోని ఇషా యోగా కేంద్రంలో, ప్రసిద్ధ ఆదియోగి ఎదురుగా జరిగే గ్రాండ్ ఫైనల్‌కు చేరుకుంటాయని ప్రకటనలో వివరించారు.
