AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RBI: లోన్లు తీసుకున్నవారికి బ్యాడ్ న్యూస్.. పెరగనున్న ఈఎంఐలు..! ఆర్బీఐ షాక్ ఇవ్వనుందా..?

మీరు తీసుకున్న రుణంపై ప్రతీ నెలా ఈఎంఐ చెల్లిస్తున్నారా.. అయితే మీకు షాకింగ్ న్యూస్. రానున్న రోజుల్లో మీరు చెల్లించాల్సిన ఈఎంఐ పెరిగే అవకాశముంది. ఆర్బీఐ వడ్డీ రేట్లపై రాబోయే రోజుల్లో సవరణలు చేసే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

RBI: లోన్లు తీసుకున్నవారికి బ్యాడ్ న్యూస్.. పెరగనున్న ఈఎంఐలు..! ఆర్బీఐ షాక్ ఇవ్వనుందా..?
Loan Emi
Venkatrao Lella
|

Updated on: Jul 14, 2026 | 12:22 PM

Share

లోన్లు తీసుకున్నవారికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా షాక్ ఇవ్వనుందా.. వడ్డీ రేట్లను పెంచనుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తాయి. ప్రస్తుతానికి పెంచకపోయినా.. ఈ ఏడాది చివరిలోపు పెంచే అవకాశముందని ఆర్దిక రంగ నిపుణులు, సంస్థలు అంచనా వేస్తున్నాయి. ఇదే జరిగితే లోన్లు తీసుకున్నవారిపై ఈఎంఐల భారం పడనుంది. కేంద్రం గత ఏడాదిలో వడ్డీ రేట్లను తగ్గించడంతో ప్రస్తుతానికి లోన్లు తీసుకున్నవారికి కొంత ఉపశమనం లభించింది. అయితే అంతర్జాతీయంగా యుద్దాలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచే అవకాశముందనే వార్తలు ఆర్ధిక నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. కానీ ప్రస్తుతం తక్షణపై మార్పులు చేసే అవకాశం లేదు. కానీ అంతర్జాతీయంగా యుద్దాలు, ద్రవ్యోల్బణం పెరుగుతున్న క్రమంలో రాబోయే రోజుల్లో వడ్డీ రేట్లను పెంచే అవకాశముందనే అంచనాలు వెలువడుతున్నాయి.

డిసెంబర్ నాటికి వడ్డీ రేట్లు పెరుగుతాయా..?

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ బోఫా సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం.. డిసెంబర్ నాటికి వడ్డీ రేట్లను ఆర్బీఐ పెంచే అవకాశముందని అంచనా వేసింది. యుద్దాల వల్ల ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు, దేశంలోని వాతావరణ మార్పులతో ధరలు పెరిగే అవకాశం ఉన్నందున ఈ ఏడాది డిసెంబర్ నాటికి వడ్డీ రేట్లు 50 బేసిస్ పాయింట్లు పెంచవచ్చని తెలిపింది. అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక సమస్యల కంటే స్థానిక వాతావరణ మార్పుల వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ ప్రభావితమవుతోంది. దేశంలో లోటు వర్షపాతం నమోదవ్వడం, ఎల్‌నీవో ప్రభావం రాబోయే నెలల్లో వ్యవసాయ రంగాన్ని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయవచ్చు. కరువు పరిస్థితుల వల్ల ఆహార ధరలు భారీగా పెరుగుతాయి. దీని వల్ల ద్రవ్యోల్బణంపై ఒత్తిడి మరింత పెరిగే అవకాశముంది.

రుణాలకు పెరగనున్న డిమాండ్..

బోఫా సెక్యూరిటీస్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి తన జీడీపీ వృద్ధి అంచనాను 6.5 శాతం నుంచి 6.9 శాతానికి పెంచింది. చమురు ధరలు తగ్గడం వల్ల దేశ కరెంట్ అకౌంట్ లోటు కూడా జీడీపీలో 1.2 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. ఇక ప్రభుత్వ ద్రవ్య లోటు 4.5 శాతంగానే కొనసాగుతుందని స్పష్టం చేసింది. మెరుగుపడుతున్న ఆర్థిక వ్యవస్థ బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలకు ఒక వరం అవుతుంది. ప్రజలు ఎక్కువగా ఖర్చు చేస్తున్నందున.. రిటైల్, వాహన రుణాలు, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణాల డిమాండ్ పెరుగుతుంది. భవిష్యత్తు ద్రవ్యోల్బణం మరియు ఆర్‌బిఐ వడ్డీ రేట్ల పెంపుదల వల్ల అటువంటి సంస్థలకు రుణాలు తీసుకునే వ్యయం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. కాగా వడ్డీ రేట్లను పెంచడం వల్ల లోన్లు తీసుకున్నవారికి ఈఎంఐ పెరుగుతుంది. ఇది సామాన్యులకు భారంగా చెప్పవచ్చు.

Follow Us
పెరగనున్న ఈఎంఐలు.. లోన్లు తీసుకున్నవారికి ఆర్బీఐ షాక్..!
పెరగనున్న ఈఎంఐలు.. లోన్లు తీసుకున్నవారికి ఆర్బీఐ షాక్..!
రోహిత్, కోహ్లీ చివరి ప్రపంచకప్‌నకు ముందే జైషా సంచలన నిర్ణయం..?
రోహిత్, కోహ్లీ చివరి ప్రపంచకప్‌నకు ముందే జైషా సంచలన నిర్ణయం..?
శక్తివంతమైన గ్రహాలు ఢీ.. వీరి కెరీర్‌కు ముప్పే
శక్తివంతమైన గ్రహాలు ఢీ.. వీరి కెరీర్‌కు ముప్పే
ఆ హీరోకి కారు డ్రైవింగ్ నేర్పింది నేనే..
ఆ హీరోకి కారు డ్రైవింగ్ నేర్పింది నేనే..
ఆషాఢం అమావాస్య రోజే దిశ మార్చుకుంటున్న గురుడు.. వీరికి సమస్యలే
ఆషాఢం అమావాస్య రోజే దిశ మార్చుకుంటున్న గురుడు.. వీరికి సమస్యలే
ఒకే క్లిక్‌తో పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.. ఎలానో చూడండి
ఒకే క్లిక్‌తో పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.. ఎలానో చూడండి
ఎంత పని చేశావ్ భారతీ.. ఇద్దరు చిన్నారులను చంపి, ఆపై ఆత్మహత్య
ఎంత పని చేశావ్ భారతీ.. ఇద్దరు చిన్నారులను చంపి, ఆపై ఆత్మహత్య
బరువు తగ్గేందుకు సూపర్ ఫుడ్.. ఇలా చేస్తే ఇట్టే మొలకలు వస్తాయ్..
బరువు తగ్గేందుకు సూపర్ ఫుడ్.. ఇలా చేస్తే ఇట్టే మొలకలు వస్తాయ్..
ఈ యాప్‌తో మీ చూట్టుపక్కల పాములు ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు
ఈ యాప్‌తో మీ చూట్టుపక్కల పాములు ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు
ఇలా చారు పెట్టి అన్నంలో పోసుకుంటే.. జీర్ణ సమస్యలన్నీ ఫట్ అంతే..
ఇలా చారు పెట్టి అన్నంలో పోసుకుంటే.. జీర్ణ సమస్యలన్నీ ఫట్ అంతే..