AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత పని చేశావ్ భారతీ.. ఇద్దరు చిన్నారులను చంపి, ఆపై ఆత్మహత్య

పల్నాడు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి హతమార్చి, అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు..

ఎంత పని చేశావ్ భారతీ.. ఇద్దరు చిన్నారులను చంపి, ఆపై ఆత్మహత్య
Woman And Two Sons Found Dead In Palnadu
Srilakshmi C
|

Updated on: Jul 14, 2026 | 11:59 AM

Share

పల్నాడు, జులై 14: కుటుంబ కలహాల నేపథ్యంతో ఓ తల్లి దారుణానికి పాల్పడింది. తన ఇద్దరు పిల్లలను తన చేతులతోనే హత్యచేసి, ఆ తర్వాత ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే..

పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లి గ్రామానికి చెందిన నక్కా భారతి (24) అనే మహిళకు సునీల్‌ రెడ్డితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి తేజేష్‌రెడ్డి (6), హేమనాథ నాగి రెడ్డి (4) ఇద్దరు కుమారులు ఉన్నారు. తన ఇద్దరు చిన్నారులను హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. భర్త సునీల్‌రెడ్డి పాల వ్యాను డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించే వాడు. అయితే గత కొంతకాలంగా దంపతుల మధ్య మనస్పర్థలు రావడంతో తరచూ గొడవలు రాసాగాయి.

ఈ నేపథ్యంలో భర్త బయటకు వెళ్లిన సమయంలో భారతి తన ఇద్దరు కుమారులకు విషం ఇచ్చి హతమార్చింది. అనంతరం ఆమె కూడా ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృత దేహాలను స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ లెటర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అందులో నా చావుకు ఎవరూ కారణం కాదని భారతి రాసినట్లు తెలుస్తోంది. దీంతో భారతి ఈ ఘోర నిర్ణయం ఎందుకు తీసుకుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇందులో భాగంగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్థానికులను పోలీసులు విచారిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక, సూసైడ్ లెటర్ పరిశీలన అనంతరం ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

Follow Us
ఒకే క్లిక్‌తో పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.. ఎలానో చూడండి
ఒకే క్లిక్‌తో పీఎఫ్ క్లెయిమ్ స్టేటస్ తెలుసుకోవచ్చు.. ఎలానో చూడండి
ఎంత పని చేశావ్ భారతీ.. ఇద్దరు చిన్నారులను చంపి, ఆపై ఆత్మహత్య
ఎంత పని చేశావ్ భారతీ.. ఇద్దరు చిన్నారులను చంపి, ఆపై ఆత్మహత్య
బరువు తగ్గేందుకు సూపర్ ఫుడ్.. ఇలా చేస్తే ఇట్టే మొలకలు వస్తాయ్..
బరువు తగ్గేందుకు సూపర్ ఫుడ్.. ఇలా చేస్తే ఇట్టే మొలకలు వస్తాయ్..
ఈ యాప్‌తో మీ చూట్టుపక్కల పాములు ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు
ఈ యాప్‌తో మీ చూట్టుపక్కల పాములు ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు
ఇలా చారు పెట్టి అన్నంలో పోసుకుంటే.. జీర్ణ సమస్యలన్నీ ఫట్ అంతే..
ఇలా చారు పెట్టి అన్నంలో పోసుకుంటే.. జీర్ణ సమస్యలన్నీ ఫట్ అంతే..
షాపింగ్ చేసేవారికి బ్యాడ్ న్యూస్.. ఇకపై అన్నీ ఆఫర్లు బంద్..
షాపింగ్ చేసేవారికి బ్యాడ్ న్యూస్.. ఇకపై అన్నీ ఆఫర్లు బంద్..
రోహిత్ ఔట్.. సందిగ్ధంలో కోహ్లీ ప్లేస్.. బాంబ్ పేల్చిన గంభీర్..?
రోహిత్ ఔట్.. సందిగ్ధంలో కోహ్లీ ప్లేస్.. బాంబ్ పేల్చిన గంభీర్..?
ఆమ్లెట్ ఇలా చేస్తే వెన్నలాగా కరిగిపోతుంది..
ఆమ్లెట్ ఇలా చేస్తే వెన్నలాగా కరిగిపోతుంది..
శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న సరికొత్త యుద్దనౌకలు
శత్రువుల గుండెల్లో వణుకు పుట్టిస్తున్న సరికొత్త యుద్దనౌకలు
నా బయోపిక్‌లో ఆమే హీరోయిన్‌గా నటించాలి..
నా బయోపిక్‌లో ఆమే హీరోయిన్‌గా నటించాలి..