Trivikram : సింగర్స్ లేరని ఆ సినిమాలో పాట పాడిన త్రివిక్రమ్.. ఇప్పటికీ యూట్యూబ్‌లో సెన్సేషన్ ఆ పాట..
దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం ఆదర్శ కుటుంబం సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఓ సినిమాలో పాట పాడిన అరుదైన అనుభవాన్ని పంచుకున్నారు. సింగర్స్ లేకపోవడంతో, ఆయన, కోటి గారు కలిసి ఓ పాటలో కోరస్ పాడినట్లు గుర్తు చేసుకున్నారు.

దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో హీరో వెంకటేశ్ నటిస్తున్న లేటేస్ట్ మూవీ ఆదర్శ కుటుంబం. ఈ చిత్రాన్ని త్వరలోనే అడియన్స్ ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్రం ప్రమోషన్లలో పాల్గొంటున్న త్రివిక్రమ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన కెరీర్‌లో అరుదైన గాయకుడిగా మారిన సంఘటనలను, అలాగే తన వ్యక్తిగత అభిప్రాయాలను ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆయన దర్శకత్వం వహించిన నువ్వే నువ్వే చిత్రంలోని “కంప్యూటర్స్, ఆర్ట్స్, సైన్స్” పాట ప్రారంభ కోరస్‌ను తానే పాడినట్లు వెల్లడించారు. ఈ పాట రికార్డింగ్ సమయంలో రాత్రి బాగా పొద్దుపోవడంతో, గాయకులు ఎవరూ అందుబాటులో లేరు. మరుసటి రోజు చిత్ర యూనిట్ ఊటీలో షూటింగ్‌కు బయలుదేరాల్సి ఉండటంతో సమయం తక్కువగా ఉండేది. అప్పటి పరిస్థితులలో నేరుగా రికార్డింగ్ చేసుకునే సాంకేతికత కూడా అందుబాటులో లేకపోవడం వల్ల, సంగీత దర్శకుడు కోటితో కలిసి త్రివిక్రమ్ స్వయంగా ఆ పాటలోని కొన్ని లైన్లను ఆలపించారు. “పాపంరో పాపాయిరో” వంటి నాలుగు లైన్ల లిరిక్స్ మాత్రమే తాను పాడానని, “కంప్యూటర్స్, ఆర్ట్స్, సైన్స్” పాటలోని ప్రధాన భాగాన్ని మాత్రం గాయకులే పాడారని త్రివిక్రమ్ స్పష్టం చేశారు. ఈ సంఘటన ఆయన సినీ కెరీర్‌లో ఒక ఆసక్తికరమైన జ్ఞాపకంగా నిలిచిపోయింది.
ఎక్కువ మంది చదివినవి : Megastar Chiranjeevi: చిరంజీవి, అనుష్క కాంబోలో మిస్సైన సినిమా.. కట్ చేస్తే.. ఆ హీరోయిన్‌తో బాస్ బ్లాక్ బస్టర్ హిట్..
నువ్వే నువ్వేలో కోరస్ పాడిన తర్వాత, త్రివిక్రమ్ గురు చిత్రంలో ఒక పూర్తి పాటను పాడి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు. ఆయన తన గాన ప్రయాణాన్ని గురించి మరింత వివరించారు. నటుడు వెంకటేష్ కూడా ఇటీవల పాటలు పాడి పెద్ద హిట్ అందుకున్నారని, గతంలో ఒక ఈవెంట్లో తాను పాడతానన్నా కూడా అవకాశం ఇవ్వలేదని త్రివిక్రమ్ సరదాగా గుర్తు చేసుకున్నారు. జనవరి 12న విడుదల కానున్న ఒక చిత్రంలో మళ్లీ పాట పాడతారా అని అడగగా, దాని గురించి ఇంకా ఏమీ అనుకోలేదని, దర్శకుడు అనిల్‌ని కనుక్కుంటానని చెప్పారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఐరెన్ లెగ్ అన్న హీరోయిన్.. ఒక్క పాటతో గెల్డోన్ బ్యూటీగా మార్చిన రాఘవేంద్రరావు.. ఇప్పటికీ ఆమె తోపు యాక్టర్..
త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ వంటి ప్రముఖులు సాధారణంగా అరుదుగా ఇంటర్వ్యూలలో కనిపిస్తుంటారు. దీనిపై త్రివిక్రమ్ స్పందిస్తూ, తాను సినిమా విడుదలైనప్పుడు మాత్రమే మాట్లాడుతానని, వ్యక్తిగత విషయాలు పెద్దగా ఆసక్తికరంగా ఉండవని అభిప్రాయపడ్డారు. తన ఆరోగ్యం, వ్యక్తిగత విషయాలను బహిరంగంగా చర్చించడం తనకు ఇష్టం ఉండదని తెలిపారు. తన జ్ఞాపకశక్తి గురించి మాట్లాడుతూ, సినిమాలలోని పాత్రల పేర్లు కూడా గుర్తుంచుకోవడం తనకు కష్టమని, సాధారణంగా ఎక్కువ విషయాలు గుర్తుపెట్టుకోనని సరదాగా చెప్పారు. తన పిల్లలైన సంపూర్ణ, సర్వ పేర్లను మాత్రం ఖచ్చితంగా గుర్తుంచుకున్నానని వెల్లడించారు.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఈ సినిమాకు ఏం డిమాండ్ రా బాబూ.. ఓటీటీలో గత్తరలేపుతున్న మూవీ.. ఫ్యామిలీతో అస్సలు చూడలేరు..
త్రివిక్రమ్ శ్రీనివాస్..
ఎక్కువ మంది చదివినవి : Nayanthara : తెలుగులో ఆ హీరో నాకు బెస్ట్ ఫ్రెండ్.. కానీ ఇప్పుడు చాలా బిజీ అయిపోయాడు.. నయనతార..
