AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాములను పసిగట్టే మొబైల్ యాప్.. ఇదుంటే మీ పరిసరాల్లో ఉన్నాయో లేదో ఇట్టే తెలుసుకోవచ్చు.

వర్షాకాలం వచ్చిందంటే చాలు పాముల బెడత ఎక్కువైపోతుంది. ఈ సీజన్‌లో పాములు ఎక్కడ పడితే అక్కడ విచ్చవిడిగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పొలాల్లో వెళ్లే రైతులు పాము కాటులకు గురయ్యే ప్రమాదం ఉంది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకు ఇప్పుడు సరికొత్త యాప్‌ను తీసుకొచ్చారు. ఈ యాప్ మన చూట్టూ పాములు ఉన్నాయా?, పాములు ఎక్కవగా ఉండే ప్రదేశాలు ఏవి, పాముల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే జాగ్రత్తలు తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ యాప్‌ ఎలా పనిచేస్తుందో చూద్దాం.

Anand T
|

Updated on: Jul 14, 2026 | 11:42 AM

Share
మన చుట్టూ పాములు ఉన్నాయా అనేది ఒక యాప్ ద్వారా కనిపెట్టవచ్చంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. అవును పాములను గుర్తించేందుకు సరికొత్త యాప్ అందుబాటులోకి వచ్చింది. దాని పేరే బిగ్‌ ఫోర్ మ్యాపర్ (Big 4 Mapper) ఈ యాప్ జీపీఎస్ టెక్నాలజీ ద్వారా పనిచేస్తుంది. అయితే మీకు ఎక్కడైన పాములు కనిపిస్తే.. ఆ లోకేషన్‌ను మీరు ఈ యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. దీని వల్ల ఈ యాప్ యూజ్ చేసే వినియోగదారులు ఆ లోకేషన్‌కు వెళ్లినప్పుడు అప్రమత్తంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది.

1 / 5
ఈ యాప్ రైతులు, అటవీ ప్రాంతాల సమీపంలో నివసించే ప్రజలు, రాత్రి వేళల్లో బయటకు వెళ్లేవారికి చాలా యూజ్‌పుల్‌గా ఉంటుంది. వర్షాకాలంలో పాములు తమ నివాసాల నుండి బయటకు వచ్చినప్పుడు, ప్రమాదకరమైన ప్రాంతాల గురించి హెచ్చరించడం ద్వారా ప్రజలు అప్రమత్తంగా ఉండటానికి ఇలాంటి యాప్‌లు సహాయపడతాయి. అయితే, ఇవి ప్రమాదాన్ని పూర్తిగా అంచనా వేయలేవు, కేవలం గతంలో నమోదైన నివేదికలు, స్థలాల ఆధారంగా మాత్రమే సమాచారాన్ని అందిస్తాయి.

2 / 5
అయితే మీకు కనిపించిన పాము ఏ జాతికి చెందింది, అది ఎంత ప్రమాదకరమైనదో కూడా ఈ యాప్‌ తెలియజేస్తుంది. ఎవరైన తమకు కనిపించిన పాము ఫోటోను అప్‌లోడ్ చేస్తే.. అది ఆ పామును గుర్తించి.. దాని సంబంధించిన పూర్తి వివరాలను యూజర్‌కు అందిస్తుంది. దీని వల్ల వినియోగదారులు వివిధ జాతుల పాముల గురించి తెలుసుకోవడానికి ,అనవసరమైన భయాన్ని పోగొట్టుకోవడానికి సహాయపడుతుంది.

3 / 5
అయితే ఈ యాప్ ఉంది కదా అని మీరు నిర్లక్ష్యం ఉండడం సరికాదు.. ఎవరికైనా పాము కరిస్తే, కేవలం యాప్‌పైనే ఆధారపడకూడదు. విషపూరిత పాము కాటుకు సకాలంలో అందించే వైద్యం, యాంటీ-స్నేక్ వెనమ్ మాత్రమే సరైన చికిత్సలు. కాబట్టి బాధితుడిని వీలైనంత త్వరగా సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లడం చాలా ముఖ్యం. అనేక ఆధునిక యాప్‌లు ప్రథమ చికిత్స సమాచారాన్ని అందించినప్పటికీ, అవి వైద్య సంరక్షణకు ప్రత్యామ్నాయం కావు.

4 / 5
వర్షాకాలంలో ఇంటి చుట్టుపక్కల ఉన్న పొదలను తొలగించడం, రాత్రి వేళల్లో టార్చ్ లైట్ ఉపయోగించడం, పొలాల్లో పనిచేసేటప్పుడు గమ్ బూట్లు ధరించడం, ఏదైనా వస్తువును పట్టుకునే ముందు పరిసరాలను పూర్తిగా తనిఖీ చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సాంకేతికత అవగాహనను పెంచగలదు, కానీ నిరంతర అప్రమత్తత, సకాలంలో అందించే వైద్య సహాయం మాత్రమే అత్యుత్తమ రక్షణ.

5 / 5
Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్

మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..

సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..

తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్

నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!

యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్

బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..

అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి

క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?

ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!