Goa Liquor: గోవా నుంచి మనం ఫ్లైట్‌లో, రోడ్డు మార్గంలో ఎంత లిక్కర్ తెచ్చుకోవచ్చు.. ఇదిగో కంప్లీట్ డీటేల్స్
మీరు గోవా నుండి విమానంలో అయితే 5 లీటర్ల మద్యాన్ని తీసుకెళ్లవచ్చు. గోవాలో ఏ మద్యం షాపు యజమానిని అడిగినా ఇదే మాట చెబుతాడు. విమానయాన సంస్థలకు కూడా దీనిపై ఇంటర్నెట్‌లో క్లారిటీ ఇస్తాయి.

గోవాలోని అద్భుతమైన బీచ్‌లకు పర్యాటకులను ఆకర్షిస్తాయి. ఇక అక్కడ చాలా చౌకగా మద్యం లభిస్తుంది. మరి అక్కడి నుంచి మద్యం ఇతర రాష్ట్రాలకు తీసుకువెళ్లొచ్చా..? తెలుసుకుందాం పదండి. ఇక్కడ మీరు గోవా నుంచి వెళ్లే స్టేట్ రూల్స్ కూడా ముఖ్యంగా తెలుసుకోవాలి. ఆంధ్రాలో అయితే ఈ గోవా లిక్కర్‌ను అస్సలు అనుమతించరని మా వద్ద సమాచారం ఉంది. గోవా నుంచి హైదరాబాద్ ఫ్లైట్ మార్గంలో అయితే ఒక్కో పర్సన్ కి 5 లీటర్ల మద్యాన్ని చెక్‌ఇన్ బ్యాగేజ్‌లో తీసుకెళ్లేందుకు అనుమతిస్తారు. కానీ హ్యాండ్ బ్యాగేజ్‌లో మాత్రం అస్సలు అనుమతించరు. మీరు అతి తెలివి ప్రదర్శించి.. హ్యాండ్ బ్యాగేజ్‌లో తీసుకుని రావాలి అనుకున్నారు అనుకోండి.. కస్టమ్స్ సెక్యూరిటీ వాళ్ళు మీ చేతే ఆ బాటిల్స్ ఓపెన్ చేయించి ట్రాష్ కాన్‌లో పోయిస్తారు. 24 నుంచి 70 శాతం మధ్య ఉన్న లిక్కర్‌కు మాత్రమే ఈ 5-లీటర్ పరిమితి వర్తిస్తుంది. మీరు తీసుకెళ్తున్న లిక్కర్‌లో ఆల్కహాల్ కంటెంట్ 24% కంటే తక్కువగా ఉంటే, అప్పుడు 5-లీటర్ రూల్ ఉండదు. అలాగే మందు లీకేజ్ అనేది ఉండకూడదు. సీల్ బాటిల్స్ అయి ఉండాలి.
ఇక బస్సులు, ప్రైవేట్ వాహనాల విషయానికి వస్తే.. రెండు కంటే ఎక్కువ మద్యం బాటిళ్లను తీసుకుని గోవా రాష్ట్ర బోర్డర్‌ను దాటడం ఖచ్చితంగా చట్టవిరుద్ధం. 2 బాటిల్స్ కూడా నార్మల్‌గా తీసుకురావడానికి వీల్లేదు. అథారిటీ కలిగిన డీలర్ లేదా ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం నుంచి 20 రూపాయలు( ఒక్కో బాటిల్‌కు 10) చెల్లించి తీసుకున్న పర్మిట్ స్లిప్ అవసరం ఉంటుంది. ఇక మీరు గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఈ పర్మిట్స్.. మీరు తీసుకువెళ్లేందుకు మాత్రమే. మీరు వెళ్లే రాష్రాల్లో వాటిని అనుమతించకపోవచ్చు. ఉదాహారణకు చెప్పాలంటే.. గోవా నుండి మహారాష్ట్రకు ఒక్క మద్యం బాటిల్‌ను కూడా రవాణా చేయడానికి కూడా అనుమతి లేదు. కర్ణాటకలో కూడా ఇంచుమించు ఈ తరహా రూల్సే పెట్టారు. ఈ 2 రాష్ట్రాలు గోవాకు సమీపాన ఉన్నందున అక్రమ మద్యం రవాణాను నిలువరించేందుకు ఆయా ప్రభుత్వాలు ఈ నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ రాష్ట్రాలగుండా రోడ్డు మార్గంలో ప్రయాణించేవారు లిక్కర్ తీసుకెళ్లకపోవడమే ఉత్తమం. కేంద్ర పాలిత ప్రాంతం డామన్ డయ్యూతో పాటు పంజాబ్, రాజస్థాన్, ఒడిశా, జమ్మూ & కాశ్మీర్, మణిపూర్, మధ్యప్రదేశ్, అస్సాం, హిమాచల్ రాష్ట్రాలకు రోడ్డు మార్గం ద్వారా పర్మిట్ తీసుకుని మీరు 2 బాటిల్స్ తీసుకెళ్లవచ్చు.
(మద్యపానం ఆరోగ్యానికి హానికరం)
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




