Anurag Thakur: ఆరోగ్యమే మహాభాగ్యం.. యోగా దినోత్సవంలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్..

|

Jun 21, 2023 | 1:01 PM

International Yoga Day 2023: విశ్వవ్యాప్తంగా 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం నుంచి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో యోగా చేస్తున్నారు.

Anurag Thakur: ఆరోగ్యమే మహాభాగ్యం.. యోగా దినోత్సవంలో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్..
Anurag Thakur
Follow us on

International Yoga Day 2023: విశ్వవ్యాప్తంగా 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం ఉదయం నుంచి గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో యోగా చేస్తున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ బుధవారం హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో యోగా చేశారు. హమీర్ పూర్ లో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ వేడుకులకు అనురాగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా హాజరై.. అందరితో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. ఆరోగ్యం కోసం యోగా అందరూ చేయాలని కోరారు.

భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా బుధవారం గురుగ్రామ్‌లోని తౌ దేవి లాల్ స్టేడియంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి కూడా హరిద్వార్‌లో యోగా చేశారు.

జబల్‌పూర్‌లోని గ్యారీసన్ గ్రౌండ్‌లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధంకర్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయుష్ మంత్రి సర్బానంద్ సోనోవాల్ యోగా చేశారు. కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్ పూణేలో, అశ్వినీ వైష్ణవ్ బాలాసోర్ లో జరిగిన కార్యక్రమంలో యోగా చేశారు.

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో సాయంత్రం జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. కాగా, ప్రతిసారీలాగే ఈసారి కూడా దేశంలోని నలుమూలల కూడా యోగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగా ప్రయోజనాల గురించి అవగాహన పెంచడానికి, శారీరక, మానసిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుకు తోడ్పాటునందించేందుకు యోగా సహకరిస్తుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..