International Yoga Day 2022: ప్రపంచ వ్యాప్తంగా యోగా దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఇక కర్ణాటకలోని మైసూర్ ప్యాలెస్‌లో నిర్వహిస్తున్న యోగా వేడుకల్లో ప్రధాన నరేంద్ర మోడీ పాల్గొని యోగాసాలను చేశారు. అనంతరం మోడీ మాట్లాడుతూ.. మైసూరు వంటి భారతదేశంలోని ఆధ్యాత్మిక కేంద్రాలు శతాబ్దాలుగా పెంపొందించిన యోగా-శక్తి నేడు ప్రపంచ ఆరోగ్యానికి దిశానిర్దేశం చేస్తోందన్నారు. నేడు యోగా ప్రపంచ సహకారానికి పరస్పర ప్రాతిపదికగా మారుతోంది. ఈరోజు యోగా మానవులకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదిస్తోందని అన్నారు.
యోగా అనేది ఒక్కరికో, ఏ మతానికో చెందినది కాదని, అందరిదని అన్నారు. యోగాతో క్రమ శిక్షణ అలవడుతుందని అన్నారు.
యోగాను గుర్తించిన ఐక్యరాజ్యసమితి సహా ప్రపంచ దేశాలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. భారత ప్రత్యేకతను, వైవిధ్యాన్ని యోగా ప్రతిబింబిస్తుందని అన్నారు. యోగా ఆరోగ్యం, సంతోషం, శాంతికి సూచిక అని అన్నారు. కరోనా మహమ్మారి సమయంలో యోగా ఎంతో ఉపయోగపడిందన్నారు. సమాజంలో శాంతి నెలకొల్పి సమస్యల పరిష్కారానికి యోగా అనేది ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యోగా వల్ల అనారోగ్య సమస్యలు దూరం కావడమే కాకుండా ఆరోగ్యంగా ఉండేందుకు దోహదపడుతుందన్నారు. యోగా అనేది ప్రాచీన భారతీయ వారసత్వంలో ఒక భాగం. ఇది మానవాళికి భారతదేశం ఇచ్చిన బహుమతి, ఆరోగ్యం, ఆరోగ్యానికి సంపూర్ణ విధానం. యోగా మనస్సు, శరీరం మరియు ఆత్మను సమతుల్యం చేస్తుందని అన్నారు.
దేశం 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని అమృత మహోత్సవ్‌ను జరుపుకుంటున్న తరుణంలో ఈసారి భారతదేశంలో యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని ప్రధాని మోదీ అన్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి