AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇండియా S-400 వర్సెస్‌ పాకిస్థాన్‌ HQ-9 మధ్య తేడా ఏంటి? రెండు డిఫెన్స్‌ సిస్టమ్స్‌లో ఏది పవర్‌ ఫుల్‌..?

భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో, వారి వద్ద ఉన్న వైమానిక రక్షణ వ్యవస్థలైన S-400, HQ-9 లను పోల్చడం చాలా ముఖ్యం. S-400 దూర పరిధి, కచ్చితత్వం, సామర్థ్యం HQ-9 కంటే ఎక్కువగా ఉన్నాయని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

ఇండియా S-400 వర్సెస్‌ పాకిస్థాన్‌ HQ-9 మధ్య తేడా ఏంటి? రెండు డిఫెన్స్‌ సిస్టమ్స్‌లో ఏది పవర్‌ ఫుల్‌..?
S 400
SN Pasha
|

Updated on: May 09, 2025 | 11:14 AM

Share

పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా మే 7న భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాత.. భారత్‌, పాకిస్తాన్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు పెరిగాయి. పాకిస్తాన్ భారత్‌లోని పలు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అనేక వైమానిక దాడులను ప్రారంభించింది. వాటిని భారత్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ అడ్డుకుంది. వెంటనే ప్రతి దాడి కూడా ప్రారంభించింది. కరాచీ పోర్ట్‌పై దాడి చేసినట్లు సమాచారం. అయితే.. పాకిస్థాన్‌ మన దేశంపై ప్రయోగించిన క్షిపణులను, డ్రోన్లను మన విజయవంతంగా అడ్డుకోవడానికి అధునాతన S-400 వైమానిక రక్షణ వ్యవస్థ అద్భుతంగా పనిచేసింది. ఈ సిస్టమ్‌ను మనం రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేసింది. అయితే మన దగ్గర ఉన్నట్లే పాకిస్థాన్‌ వద్ద కూడా HQ-9 అనే డిఫెన్స్‌ సిస్టమ్‌ ఉంది. మరి భారత్‌ S-400, పాకిస్తాన్ HQ-9లలో ఏది పవర్‌ ఫుల్‌, ఏది ఎంత సామర్థ్యం కలిగి ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

S-400

గుర్తింపు పరిధి: 600 కిలో మీటర్ల వరకు క్షిపణి లక్ష్య పరిధి: 400 కిలో మీటర్ల వరకు క్షిపణి రకాలు: 120 కి.మీ, 200 కి.మీ, 250 కి.మీ, 400 కి.మీ వేరియంట్లు ఫైటర్ జెట్‌లు, బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్‌లు, క్రూయిజ్ క్షిపణులను సెకన్లలోనే నాశనం చేయగలదు. ప్రతి స్క్వాడ్రన్‌లో లాంచర్లు, రాడార్లు, కమాండ్ సెంటర్లు, సహాయక వాహనాలతో కూడిన 16 వాహనాలు ఉంటాయి.

HQ-9

గుర్తింపు పరిధి: 200 కిలో మీటర్ల వరకు క్షిపణి పరిధి: మధ్యస్థ-శ్రేణి అడ్డగింపు సామర్థ్యం పాత సోవియట్ సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా, దీనికి ఆధునిక వ్యవస్థల బహుముఖ ప్రజ్ఞ, కచ్చితత్వం లేదు. మే 7న పాకిస్తాన్, పీఓకేపై దాడుల సమయంలో భారత విమానాలను గుర్తించడంలో విఫలమైంది. భారతదేశం ప్రతీకార దాడులలో HQ-9 యూనిట్లు దెబ్బతిన్నాయని నివేదికలు సూచిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
మళ్లీ ట్రెండింగ్ లోకి వచ్చిన దర్శకుల డ్రీమ్ ప్రాజెక్ట్స్..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..
రాత్రుళ్లు ఈ ప్రదేశాలు మహాద్భుతం.. హాలీవుడ్ భవనాలను తలపిస్తాయి..