డబ్ల్యూహెచ్ఓలో భారత్‌కు కీలక పదవి

ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్‌కు కీలక పదవి దక్కింది. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కుమ్మేస్తున్న సమయంలో… దాన్ని పర్యవేక్షించే కీలకమైన డబ్ల్యూహెచ్ఓ (WHO) కార్యనిర్వాహక మండలి ఛైర్మన్‌ పదవి భారత్‌ను వరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ను నియమించింది. 34 మంది సభ్యులుగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా ప్రస్తుతం జపాన్‌కు చెందిన హిరోకి నకటాని ఉన్నారు. హిరోకి పదవీకాలం ముగియడంతో కేంద్ర […]

డబ్ల్యూహెచ్ఓలో భారత్‌కు కీలక పదవి
Follow us

| Edited By:

Updated on: May 20, 2020 | 11:03 AM

ప్రపంచ ఆరోగ్య సంస్థలో భారత్‌కు కీలక పదవి దక్కింది. ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కుమ్మేస్తున్న సమయంలో… దాన్ని పర్యవేక్షించే కీలకమైన డబ్ల్యూహెచ్ఓ (WHO) కార్యనిర్వాహక మండలి ఛైర్మన్‌ పదవి భారత్‌ను వరించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ను నియమించింది. 34 మంది సభ్యులుగా ఉన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక బోర్డు చైర్మన్‌గా ప్రస్తుతం జపాన్‌కు చెందిన హిరోకి నకటాని ఉన్నారు. హిరోకి పదవీకాలం ముగియడంతో కేంద్ర మంత్రి హర్షవర్దన్‌ ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. హర్షవర్ధన్‌ మూడేళ్లపాటు ఈ పదవిలో ఉండనున్నారు. డబ్ల్యూహెచ్ఓ విధానపరమైన నిర్ణయాల్లో కార్యనిర్వాహక బోర్డు కీలక భూమిక పోషిస్తుంది.