
భారతదేశ చరిత్రలో కోల్‌కతా మెట్రో సరికొత్త మైలురాయి సాధించింది. దేశంలో మొదటిసారిగా హుగ్లీ నది కింద సొరంగం ద్వారా కోల్‌కతా మెట్రో విజయవంతంగా ట్రయల్ రన్ పూర్తిచేసుకుంది. దేశంలోనే తొలిసారిగా 1984లో కోల్‌కతా మెట్రో రైలు ప్రారంభమయ్యింది. మళ్లీ 39 ఏళ్ల తర్వాత కొత్త చరిత్రను తిరగరాస్తూ.. నది లోపలి నుంచి మెట్రో రైలు నడిచింది. హుగ్లీ నదిలో నిర్మించిన సొరంగ మార్గంలో కోల్‌కతాలోని మహాకరణ్ స్టేషన్ నుంచి హౌరా మైదాన్ స్టేషన్ వరకు రైలు పరుగులు తీసింది. బుధవారం జరిగిన ట్రయల్ రన్‌లో కోల్‌కతా మెట్రో రైల్వే జనరల్ మేనేజర్ పి.ఉదయ్‌కుమార్ రెడ్డితో పాటు మరికొందరు సీనియర్ అధికార్లు, ఇంజినీర్లు ప్రయాణం చేశారు.
కోల్‌కతా నగర ప్రజలకు ఆధునిక రవాణా వ్యవస్థను అందించే ప్రయత్నంలో ఇది విప్లవాత్మక ముందడుగు అని అధికారులు పేర్కొన్నారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంపై అధికారులు, ఇంజినీర్లకు మెట్రో జీఎం ఉదయ్‌కుమార్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ఇదో చారిత్రక ఘట్టమని ఈ మైలురాయి చేరుకునేందుకు కోల్‌కతా మెట్రో సిబ్బంది ఎంతో శ్రమించారని హౌరా మైదాన్-ఎస్‌ప్లనేడ్ స్టేషన్ల మధ్య 4.8 కిలోమీటర్ల మార్గంలో ట్రయల్ రన్‌ను 7 నెలల పాటు కొనసాగిస్తామని తెలిపారు . మెట్రో సొరంగం భూఉపరితలానికి 33 మీటర్ల లోతులో ఉందని చెప్పారు. హౌరా నుంచి ఎస్ప్లానేడ్ వరకు విస్తరించి ఉన్న మార్గం సుమారు 4.8 కి.మీ ఉంటుంది. ఇందులో 520 మీటర్లు హుగ్లీ నది కింద సొరంగం ద్వారా ఉంటుంది.
Train travels underwater!?? ?
Trial run of train through another engineering marvel; metro rail tunnel and station under Hooghly river. pic.twitter.com/T6ADx2iCao
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) April 14, 2023
కాగా.. నది అడుగున మైట్రో రైలు ట్రైయిల్ రన్ విజయవంతంపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ స్పందించారు. నీటి అడుగున రైలు ప్రయాణం.. అద్భుతం అంటూ ట్వీట్ చేశారు. మరొక ఇంజనీరింగ్ అద్భుతం.. ట్రయల్ రన్‌ను పూర్తి చేసుకుందన్నారు. హుగ్లీ నది కింద మెట్రో రైలు సొరంగం, స్టేషన్.. సూపర్ అంటూ ట్వీట్ చేశారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం..