జుకర్ బెర్గ్ కి లేఖ రాశాం, భారతీయులు [ప్రశ్నించాల్సిందే, రాహుల్ గాంధీ

అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఓ ఆర్టికల్ పై వివాదం రేగిన  నేపథ్యంలో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,, ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బెర్గ్ కు తమ పార్టీ రాసిన..

  • Umakanth Rao
  • Publish Date - 3:42 pm, Tue, 18 August 20
జుకర్ బెర్గ్ కి లేఖ రాశాం, భారతీయులు [ప్రశ్నించాల్సిందే,  రాహుల్ గాంధీ

అమెరికా పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన ఓ ఆర్టికల్ పై వివాదం రేగిన  నేపథ్యంలో.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ,, ఫేస్ బుక్ చీఫ్ మార్క్ జుకర్ బెర్గ్ కు తమ పార్టీ రాసిన ఓ లేఖను విడుదల చేశారు. పాలక బీజేపీ, మితవాద నేతల ద్వేష పూరిత ప్రసంగాలు, అభ్యంతరకర కంటెంట్ ను ఫేస్ బుక్ కావాలనే పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. ఇండియాలో ఫేస్ బుక్ ఎగ్జిక్యూటివ్ ప్రవర్తనా ధోరణిపై నెల లోగా ఉన్నత స్థాయి విచారణ జరగాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్ అంఖి దాస్ పేరును కూడా ఆయన ప్రస్తావించారు.

పక్షపూరితమైన, ద్వేషపూరిత ప్రసంగాలను, వ్యాఖ్యలను మ్యానిప్యులేట్ చేయడాన్ని తాము అనుమతించబోమని, ప్రజలంతా ఫేస్ బుక్ తీరును ప్రశ్నించాలని రాహుల్ గాంధీ కోరారు. ఇలా ఉండగా ప్రజలను, మతపరమైన సెంటిమెంట్లను రెచ్ఛగొట్టారన్న ఆరోపణపై అంఖి దాస్ మీద పోలీసుకేసు నమోదైంది. తనకు ప్రాణ హాని ఉందని, పోలీస్ ప్రొటెక్షన్ అవసరమని కోరుతూ ఆమె కూడా ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.