AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smoking In Train: ఇకపై రైళ్లలో సిగరేట్‌ తాగితే అంతే సంగతులు.. కీలక నిర్ణయం తీసుకున్న భారత రైల్వే శాఖ..

Smoking In Train: పొగతాడం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసినా.. పొగరాయుళ్లు మాత్రం ధూమపానాన్ని ఆపరు. ప్రభుత్వాలు, స్వచ్ఛంధ సంస్థలు ఎంత చెప్పినా పొగతాగడం మాత్రం మానరు. ఇక సిగరెట్‌ తాగడం ద్వారా తమ ఆరోగ్యంతో పాటు వారి చుట్టు పక్కల ఉన్నవారి ఆరోగ్యాన్ని కూడా..

Smoking In Train: ఇకపై రైళ్లలో సిగరేట్‌ తాగితే అంతే సంగతులు.. కీలక నిర్ణయం తీసుకున్న భారత రైల్వే శాఖ..
Smoking In Trains
Narender Vaitla
|

Updated on: Mar 21, 2021 | 2:30 AM

Share

Smoking In Train: పొగతాడం ఆరోగ్యానికి హానికరమనే విషయం తెలిసినా.. పొగరాయుళ్లు మాత్రం ధూమపానాన్ని ఆపరు. ప్రభుత్వాలు, స్వచ్ఛంధ సంస్థలు ఎంత చెప్పినా పొగతాగడం మాత్రం మానరు. ఇక సిగరెట్‌ తాగడం ద్వారా తమ ఆరోగ్యంతో పాటు వారి చుట్టు పక్కల ఉన్నవారి ఆరోగ్యాన్ని కూడా ప్రమాదంలో నెట్టేస్తుంటారు. సిగరెట్ల ద్వారా వచ్చే పొగ వల్ల కొంతమేర ప్రమాదం ఉంటే. ఆర్పకుండా సిగరెట్లు పాడేయడం ద్వారా కూడా ప్రమాదాలు జరుగుతుంటాయి. సరిగా ఆర్పేయని సిగరేట్‌ ఇతర వస్తువులకు అంటుకోవడం ద్వారా అగ్నిప్రమాదాలు జరగుతుంటాయి. ఇటీవల న్యూఢిల్లీ-డెహ్రాడూన్‌ శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన అగ్ని ప్రమాదం కూడా ఒక సిగరేట్‌ ద్వారానే జరిగిందని విచారణలో తేలింది. ట్రైన్‌ బోగీలో ప్రయాణికుడు సిగరేట్‌ తాగి.. టాయిలెట్‌లో వేశాడు. దీంతో ఆ సిగరేట్‌ పీక కాస్త టిష్యూ పేపర్‌కు అంటుకోవడంతో పెద్ద ప్రమాదం చోటుచేసుకుందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. దీంతో మరోసారి ఇలాంటి ప్రమాదాలు జరగకూడదనే ఉద్దేశంతో భారతీయ రైల్వే శాఖ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కఠిన చర్యలు పాటిస్తే తప్ప ఇలాంటి ప్రమాదాలకు చెక్‌ పెట్టలేమని భావించిన రైల్వే శాఖ.. ఇకపై రైళ్లలో ఎవరైనా సిగరేట్‌ తాగి దొరికితే భారీ మొత్తంలో జరిమానాతో పాటు అరెస్ట్‌ కూడా చేస్తామని తెలిపింది. రైళ్లలో ధూమపానం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జోనల్‌ జనరల్‌ మేనేజర్లు, రైల్వే బోర్డు సభ్యులను కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్‌ గోయల్‌ ఆదేశించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం చట్టంలోని సెక్షన్‌ 167 ప్రకారం.. రైళ్లలో ధూమపానం చేసిన ప్రయాణికులకు రైల్వే అధికారులు రూ. 100 జరిమానాగా విధిస్తున్నారు. దీంతో ప్రస్తుతం ఈ ఫైన్‌ భారీగా పెరగనుంది.

Also Read: మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసుల నమోదు..

Brilliant Dog: లెక్కల్లో దిట్ట ఈ కుక్క.. ప్రశంసిస్తున్న నెటిజన్లు.. చూస్తే మీరే షాకవుతారు.. వీడియో

అంబానీ ఇంటివద్ద బాంబు కేసులో మహారాష్ట్ర హోం మంత్రిపై మాజీ సీపీ షాకింగ్ ఆరోపణలు

Follow Us