Gold Price Today: పెరిగిన బంగారం ధరలు.. కొన్ని నగరాల్లో తగ్గుతుంటే..మరికొన్ని నగరాల్లో పెరిగింది.. తాజా ధరలు..
Gold Price Today: పసిడి ప్రియులకు ఒక రోజు గుడ్ న్యూస్ అందుతుంటే.. మరో రోజు బ్యాండ్ న్యూస్ వినాల్సి వస్తుంది. రోజురోజుకు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు ..
Gold Price Today: పసిడి ప్రియులకు ఒక రోజు గుడ్ న్యూస్ అందుతుంటే.. మరో రోజు బ్యాండ్ న్యూస్ వినాల్సి వస్తుంది. రోజురోజుకు బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గుతుంది.. మరో రోజు పెరుగుతుంది. అందుకే బంగారం కొనుగోలు చేసేవారు మీరు వెళ్లే సమయానికి ఎంత రేటు ఉందో తెలుసుకొని వెళ్లాల్సి ఉంటుంది. తాజాగా దేశీయంగా బంగారం స్వల్పంగా తగ్గుతుంటే కొన్ని ప్రాంతాల్లో స్వల్పంగా పెరిగింది. ఆదివారం 10 గ్రాముల బంగారం ధరపై 160 రూపాయల వరకు పెరిగింది.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా…
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 44,400 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.48,440 ఉంది. ఇక హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,090 ఉంది. అలాగే చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,500 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,360 ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.43,930 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,930 ఉంది. అదే కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.44,560 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.47,230 ఉంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,090 ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,250 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,090 ఉంది. ఇక విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.42,250 ఉండగా,24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.46,090 వద్ద కొనసాగుతోంది.
కాగా, దేశంలోని బంగారం ధరలపై ప్రభావం చూపే కారణాలు చాలా ఉంటున్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్దాలు వంటి పలు అంశాలపై పసిడి ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కాగా, ఇటీవల నుంచే బంగారం ధరల్లో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కొన్ని రోజులు ధరలు పెరుగుతుంటే.. మరి కొన్ని రోజులు తగ్గుముఖం పడుతున్నాయి. ఒకప్పుడు 55 వేల వరకు మార్క్ దాటి పోగా, ప్రస్తుతం మాత్రం 43వేలకు అటు ఇటుగా ఉంటున్నాయి.
దేశంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఒక రోజు తగ్గుముఖం పడుతుంటే మరో రోజు ఎగబాకుతున్నాయి. అయితే ఈ మధ్య కాలంలో మాత్రం ధరలు మాత్రం బాగానే దిగివస్తున్నాయి. ఎంత పెరిగినా గతంలో కంటే తక్కువే అని చెప్పారు. బంగారం కొనుగోలు చేసే వారు ధరలను చూసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే బంగారం, వెండి ధరల్లో గంట గంటకు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటూనే ఉంటాయి.
ఇవీ చదవండి :
LIC Policy Claim: ఎల్‌ఐసీ పాలసీదారులకు శుభవార్త.. మార్చి 31 వరకే అవకాశం.. పూర్తి వివరాలు ఇవే..
Medicines Prices Hike: ప్రజలకు షాకింగ్ న్యూస్.. ఏప్రిల్ నుంచి పెరగనున్న ఔషధాల ధరలు..