రైల్వేల ‘ప్రైవేటీకరణ’? బిడ్డింగ్ ప్రక్రియ పొడిగింపు
రైల్వే శాఖను కూడా కేంద్రం ప్రైవేటీకరిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రైవేట్ ప్లేయర్ ట్రెయిన్ ప్రాజెక్టు బిడ్డింగ్ ప్రక్రియను రైల్వే శాఖ నెల పాటు పొడిగించింది.

రైల్వే శాఖను కూడా కేంద్రం ప్రైవేటీకరిస్తుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ప్రైవేట్ ప్లేయర్ ట్రెయిన్ ప్రాజెక్టు బిడ్డింగ్ ప్రక్రియను రైల్వే శాఖ నెల పాటు పొడిగించింది. వచ్ఛేనెల 8 నాటికి ఇది ముగియవలసి ఉండగా అక్టోబరు 7 వరకు పొడిగించారు. బిడ్డింగ్ రెండో ప్రక్రియకు ముందు ఈ నెల 12 న ఇందులో పాల్గొన్న ప్రైవేటు కంపెనీలు ఈ ప్రాజెక్టు బిడ్డింగ్ ప్రాసెస్ ను మరికొంతకాలం పొడిగించాలని కోరాయి. దీంతో ఈ అభ్యర్థనను అంగీకరించిన రైల్వే శాఖ బిడ్డింగ్ తేదీని నెలపాటు పొడిగిస్తూ ఈ నెల 21 న నిర్ణయం తీసుకుంది. రెండవ, ఫైనల్ బిడ్డింగ్ లో 23 ప్రైవేటు కంపెనీలు పాల్గొన్నాయి. ఇండియన్ రైల్వేస్ నెట్ వర్క్ లో ప్యాసింజర్ రైళ్ల నిర్వహణకు ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానించడం ఇదే మొదటిసారి. ఈ ప్రాజెక్టు కింద సుమారు 30 వేల కోట్ల పెట్టుబడులు రావచ్ఛునని అంచనా.



