AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indian Railways: భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. పొరుగు దేశంలో సరకు రవాణా దిశగా అడుగులు..

భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పొరుగు దేశాలతో సరకు రవాణా సేవల ఒప్పందం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే ఈశాన్య ఫ్రాంటియర్‌ రైల్వే (NFR), భూటాన్‌ల మధ్య ఈ విషయమై చర్చలు జరిగినట్లు మంగళవారం అధికారులు...

Indian Railways: భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. పొరుగు దేశంలో సరకు రవాణా దిశగా అడుగులు..
Indian Railway
Narender Vaitla
|

Updated on: Nov 03, 2022 | 11:28 AM

Share

భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. పొరుగు దేశాలతో సరకు రవాణా సేవల ఒప్పందం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే భారతీయ రైల్వేకు చెందిన ఈశాన్య ఫ్రాంటియర్‌ రైల్వే (NFR), భూటాన్‌ల మధ్య ఈ విషయమై చర్చలు జరిగినట్లు మంగళవారం అధికారులు తెలిపారు. అలీపుర్‌దూర్‌ డివిజన్‌లో ఇటీవల బిజినెస్‌ డెవపల్‌మెంట్‌ సమావేశం జరిగిందని, ఈ సమావేశానికి భూటాన్‌ విదేశాంగ మంత్రిత్వ శాఖ, వాణిజ్య సంస్థలు హాజరయ్యారని ఎన్‌ఎఫ్‌ఆర్‌ చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ సవ్యసాచి తెలిపారు.

భూటాన్‌ వాణిజ్య ఎగుమతులు జరిపేందుకు వీలుగా ఎన్‌ఎఫ్‌ఆర్‌ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్న హసిమారా రైల్వే స్టేషన్‌ను ప్రతినిధులు సందర్శించారు. భూటాన్‌తో లాజిస్టిక్‌ వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు సెంట్రల్‌ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్‌ సహకారంతో వేర్‌హౌస్‌తో పాటు సైడింగ్‌ను నిర్మించేందుకు ప్రణాళినను రూపొందిస్తున్నట్లు చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ తెలిపారు. ఇదలిలా ఉంటే ఇండియన్‌ రైల్వేస్‌ ఇప్పటికే 75 వాహనాలతో కూడిన మల్టీ మోడల్‌ రూట్‌ ద్వారా భూటాన్‌కు వస్తువులను ఎగుమతులు చేసింది.

ఇందులో భాగంగా వాహనాలను చెన్నై నుంచి హసిమారా రైల్వే స్టేషన్‌కు న్యూ మాడిఫైడ్‌ గూడ్స్‌ (NMG) రేక్‌ ద్వారా రవణా చేశారు. ఇది అక్టోబర్‌ 28న అలీపుర్‌దువార్‌ డివిజన్‌కు చేరుకుంది. అనంతరం సరకును రహదారి మార్గంగా భూటాన్‌కు తీసుకెళ్లారు. రానున్న రోజుల్లో అధికారులు చగ్రబంధ స్టేషన్‌ను సందర్శించనున్నారు. వాణిజ్య రవాణాలో భాగంగా ఆటోమొబైల్స్‌, సిమెంట్‌ సరఫరాతో పాటు పర్యాటక రంగ అభివృద్ధికి సంబంధించిన చర్చలు కూడా జరిగాయి. అస్సాంలో ఉన్న కోక్రాజార్‌ నుంచి భూటాన్‌లోని గెలెఫు వరకు బ్రాడ్‌ గేజ్‌ రైల్వే ట్రాక్‌ను వేయడం ద్వారా భారతీయ రైల్వేలు సరిహద్దుల మధ్య అనుసంధానం కోసం ఇప్పటికే కొత్త ప్రాజెక్టులను చేపట్టాయని సీపీఆర్‌ఓ పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
మేక vs గొర్రె మాంసం.. జోరు వానల్లో ఏది బెస్ట్..?
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
-మద్యం ప్రియులకు మస్త్‌ గుడ్‌న్యూస్..అందుబాటులోకి గోల్డ్‌ వోడ్కా!
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
రైతులను రిచ్ చేసే పంట.. పూర్తి వివరాలు మీ కోసం..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్‌
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
తెలంగాణ విద్యార్థులకు అలెర్ట్.. జూలై 24న విద్యాసంస్థల బంద్‌..!
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మీపేరు మీద వేరేవాళ్ళు SIM వాడుతున్నారా? గుర్తించడం ఎలా?
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
మేక పిల్లల కోసం దారుణం.. మాజీ సర్పంచ్ దాడిలో పశువుల కాపరి బలి!
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
చూసేందుకు కంటిలో నలుసంత.. కానీ దగ్గు, ఆస్తమాకు చెక్ పెట్టేస్తుంది
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!
గురు పూర్ణిమ నుంచి మహర్దశ.. ఇక ఈ రాశుల వారికి తిరుగుండదు!