Railway News: రైల్వే ప్యాసింజర్ అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు

Indian Railways: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా.. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించి పునరుద్ధరించారు.

Railway News: రైల్వే ప్యాసింజర్ అలెర్ట్.. తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లు రద్దు
Indian Railways

Railway Passenger Alert: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. మరికొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు చేయగా.. ఇంకొన్ని రైళ్లను దారి మళ్లించి పునరుద్ధరించారు. ఈ వివరాలను దక్షిణ మధ్య రైల్వే తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. రాజంపేట – నందలూరు మార్గంలో వరదల కారణంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం నెలకొంది. దీంతో ఇవాళ (23 నవంబర్) రైలు నెం.17416 కొల్లాపూర్ SCSMT – తిరుపతి రైలును రద్దు చేశారు. అలాగే బెంగళూరు కంటోన్మెంట్ నుంచి అగర్తలాకు మంగళవారంనాడు నడిచే రైలు (నెం.12503) రాకపోకల సమయాల్లో మార్పులు చేశారు.

విజయవాడ – గూడూరు మధ్య నడిచే రైలు నెం.07262, 07261 రైళ్లను మంగళవారంనాడు రద్దు చేశారు.

తిరుపతి – సాయినగర్ షిర్డి మధ్య మంగళ, బుధవారాల్లో నడిచే రైళ్లను ( నెం.17417, 17418) పునరుద్ధరించారు. ఈ రైళ్లు పాకాల, ధర్మవరం, గుత్తి మీదుగా నడుస్తాయి. అలాగే యశ్వంత్‌పూర్ – హౌరా మధ్య మంగళవారంనాడు నడిచే రైళ్లు (నెం.12246, 12864)ను రద్దు చేశారు.

అలాగే మంగళవారంనాడు నడిచే చెన్నై సెంట్రల్ – సీఎస్టీ ముంబై, చెన్నై సెంట్రల్ – ఎల్‌టీటీ ముంబై, సీఎస్‌టీ ముంబై – చెన్నై సెంట్రల్, ఎల్‌టీటీ ముంబై – చెన్నై సెంట్రల్, బిలాస్‌పూర్ – తిరునెల్వేలి రైళ్లు రద్దయ్యాయి. అలాగే బుధవారంనాడు బయలుదేరాల్సిన గోరఖ్‌పూర్ – సికింద్రాబాద్ రైలును రద్దు చేశారు.

ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా బికనీర్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక రైలు నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. ఇది మంగళవారం సాయంత్రం 07.35 గం.లకు బికనీర్ నుంచి బయలుదేరి గురువారంనాడు ఉదయం 11 గం.లకు హైదరాబాద్ చేరుకుంటుంది.

మరిన్ని రైళ్ల రాకపోకల సమయాల్లో మార్పులు..

ALso Read..

Corona: భారత్‌లో భారీగా తగ్గిన కరోనా కేసులు.. ఏకంగా 98.32 శాతానికి పెరిగిన రికవరీ రేటు..

Bangarraju Teaser: బంగార్రాజు టీజర్ వచ్చేసింది.. నాగచైతన్య లుక్ అదిరిపోయిందిగా..

Click on your DTH Provider to Add TV9 Telugu