Indian Railway: మహిళలకు శుభవార్త చెప్పిన ఇండియన్‌ రైల్వేస్‌.. ఇకపై ఆ ఇబ్బందులకు చెక్‌..

Indian Railway: ఇండియన్‌ రైల్వేస్‌ మహిళల కోసం శుభవార్త తెలిపింది. ఇక నుంచి మహిళలు రైళ్లలో సీట్ల విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని ఓ ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా మహిళలకు పై బెర్తుల్లో సీట్లు లభిస్తే ఇబ్బంది ఉంటుందనే...

Indian Railway: మహిళలకు శుభవార్త చెప్పిన ఇండియన్‌ రైల్వేస్‌.. ఇకపై ఆ ఇబ్బందులకు చెక్‌..
Indian Railway

Edited By:

Updated on: Sep 17, 2022 | 6:35 PM

Indian Railway: ఇండియన్‌ రైల్వేస్‌ మహిళల కోసం శుభవార్త తెలిపింది. ఇక నుంచి మహిళలు రైళ్లలో సీట్ల విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదని ఓ ప్రకటన విడుదల చేసింది. సాధారణంగా మహిళలకు పై బెర్తుల్లో సీట్లు లభిస్తే ఇబ్బంది ఉంటుందనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దీనిని దృష్టిలో పెట్టుకొనే ఇండియన్‌ రైల్వేస్‌ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ విషయమై రైల్వే మంత్రి అశ్విన్‌ వైష్ణవ్‌ ఒక ప్రకటన విడుదల చేశారు.

రైళ్లతో పాటు, పలు మెట్రో రైళ్లలో మహిళా ప్రయాణీకుల కోసం ప్రత్యేకంగా సీట్లను కేటాయించనున్నట్లు తెలిపారు. రైల్వేలో మహిళల సౌకర్యార్థం భారతీయ రైల్వే ప్రత్యేకంగా బెర్త్‌ల రిజర్వేషన్‌తో పాటు మరికొన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. మెయిల్‌తో పాటు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌లో మహిళల కోసం ప్రత్యేకంగా ఆరు బెర్త్‌లను రిజర్వ్‌ చేయనున్నారు. స్లీపర్‌ కోచ్‌లో ఆరు లోయర్‌ బెర్తులు, 3 టైర్‌ ఏసీ కోచ్‌లలో నాలుగు నుంచి ఐదు లోయర్‌ బెర్త్‌లు, 2 టైర్‌ ఏసీ కోచ్‌లలో మూడు నుంచి నాలుగు లోయర్‌ బెర్త్‌లు సీనియన్‌ సిటిజన్‌లు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, గర్భిణీ స్త్రీల కోసం రిజర్వ్‌ చేశారు. వీటితో పాటు రైళ్లలో మహిళల భద్రతా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామని మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. ఇందులో భాగంగానే రైల్వే ప్రొటెక్షన్‌ ఫోర్స్‌, జిల్లా పోలీసులు ప్రయాణికులకు భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..