కరోనా కాటు.. భారత సంతతి వైరాలజస్ట్ మృతి

కరోనా కాటుకు భారత సంతతికి చెందిన గీతా రామ్ జీ అనే వైరాలజిస్ట్ మరణించింది.  వారం రోజుల క్రితం లండన్ నుంచి సౌతాఫ్రికా చేరుకున్న ఈమెకు అసలు కరోనా పాజిటివ్ లక్షణాలే కనిపించలేదట..

కరోనా కాటు.. భారత సంతతి వైరాలజస్ట్ మృతి
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Apr 01, 2020 | 11:58 AM

కరోనా కాటుకు భారత సంతతికి చెందిన గీతా రామ్ జీ అనే వైరాలజిస్ట్ మరణించింది.  వారం రోజుల క్రితం లండన్ నుంచి సౌతాఫ్రికా చేరుకున్న ఈమెకు అసలు కరోనా పాజిటివ్ లక్షణాలే కనిపించలేదట.. అయితే దక్షిణాఫ్రికా చేరుకోగానే కరోనా సంబంధ రుగ్మతతో మరణించడం ఆశ్చర్యంగా ఉందని నిపుణులు అంటున్నారు. వ్యాక్సీన్ సైన్టిస్ట్, హెచ్ ఐ వీ నివారణ విభాగం లీడర్ అయిన గీతా రామ్ జీ అసాధారణ ప్రతిభావంతురాలు. హెచ్ ఐ వీ నివారణకు ఈమె చేసిన పరిశోధనలు, కనుగొన్న పధ్దతులు అనేకమంది డాక్టర్ల నుంచి  ప్రశంసలను పొందాయి. 2018 లో ఈమెకు అత్యుత్తమ మహిళా  సైన్టిస్టు అవార్డు కూడా లభించింది. లిస్బన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమెకు ఈ అవార్డు అందజేశారు. హెచ్ ఐ వీతో బాటు ఎయిడ్స్ అదుపునకు గీతా రామ్ జీ కనుగొన్న విధానాలు ప్రపంచ దేశాలకు ఎంతగానో ఉపకరించాయని దక్షిణాఫ్రికా అధికారులు తెలిపారు. ఆమె మృతికి కారణం కఛ్చితంగా కరోనానా కాదా అన్నది తేలకుండా ఉందని నిపుణులు అంటున్నారు. అయితే ఇవే లక్షణాలు ఆమె మరణానికి కారణమని అంటున్నవారూ ఉన్నారు. సౌతాఫ్రికాలో ఆరు కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆ దేశంలోకూడా ప్రజలు లాక్ ఔన్ పట్టించుకోకుండా వీధుల్లో తిరగడం పట్ల ప్రభుత్వం ఆగ్రహిస్తోంది. లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయడానికి పూనుకొంది.