Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BrahMos Missile: చైనా , పాకిస్తాన్‌ గుండెల్లో గుబులు.. బ్రహ్మోస్‌ మిస్సైల్‌‌ను విజయవంతంగా పరీక్షించిన భారత్..

చైనా , పాకిస్తాన్‌ గుండెల్లో గుబులు రేపే విధంగా బ్రహ్మోస్‌ అప్‌డేటెడ్‌ క్షిపణి పరీక్ష సక్సెస్‌ అయ్యింది. బంగాళాఖాతంలో ఉన్న నౌకను సుఖోయ్‌ యుద్ద విమానం నుంచి పేల్చేశారు.

BrahMos Missile: చైనా , పాకిస్తాన్‌ గుండెల్లో గుబులు.. బ్రహ్మోస్‌ మిస్సైల్‌‌ను విజయవంతంగా పరీక్షించిన భారత్..
Brahmos Missiles
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 05, 2023 | 9:25 PM

భారత నౌకాదళం స్వదేశీ బ్రహ్మోస్ క్షిపణిని అరేబియా సముద్రంలో విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి లక్ష్యాన్ని చేధించింది. స్వావలంబన భారత్‌లో భాగంగా భారత నౌకాదళం ఆదివారం (మార్చి 05) బ్రహ్మోస్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. దీని బూస్టర్‌ను DRDO రూపొందించింది. అరేబియా సముద్రంలో తన లక్ష్యంపై కచ్చితంగా దాడి చేసింది. బంగళాఖాతంలో ఈ పరీక్షను ఎయిర్‌ఫోర్స్‌ నిర్వహించింది. బంగాళాఖాతంలోని 400 కిలోమీటర్ల దూరంలో ఉన్న నౌకపై లక్ష్యాన్ని ఈ క్షిపణి విజయవంతంగా చేధించినట్టు రక్షణ శాఖ ప్రకటన విడుదల చేసింది. నావికాదళం విడుదల చేసిన ఒక ప్రకటనలో, “భారత నావికాదళం DRDO రూపొందించిన స్వదేశీ సాధక్, వర్ధక్ బ్రహ్మోస్ క్షిపణులతో అరేబియా సముద్రంలో ఖచ్చితమైన దాడి చేసింది. ఇది స్వావలంబన పట్ల నిబద్ధతను బలపరుస్తుంది. కోల్‌కతా క్లాస్ గైడెడ్ మిస్సైల్ డిస్ట్రాయర్ వార్‌షిప్ నుంచి క్షిపణిని పరీక్షించినట్లు ప్రకటన పేర్కొంది. బ్రహ్మోస్ ఏరోస్పేస్ క్షిపణిలో స్వదేశీ పదార్థాలను పెంచేందుకు నిరంతరం కృషి చేస్తోంది.

సుఖోయ్ నుంచి పరీక్షించిన..

భారత వైమానిక దళం 2022 డిసెంబర్‌లో బంగాళాఖాతంలో బ్రహ్మోస్ వాయు ప్రయోగ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది. ఇది 400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను లక్ష్యంగా చేసుకోగలదు. ఈ క్షిపణిని సుఖోయ్ సు-30 యుద్ధ విమానం నుంచి పరీక్షించినట్లు వైమానిక దళం తన అధికారిక ప్రకటనలో తెలిపింది. పరీక్ష సందర్భంగా క్షిపణి లక్ష్య నౌకను మధ్యలో ఢీకొట్టిందని రక్షణ శాఖ తెలిపింది. ఇది ఎయిర్-లాంచ్డ్ వెర్షన్ క్షిపణికి యాంటీ షిప్ వెర్షన్.

బ్రహ్మోస్ అంటే ఏంటి?

బ్రహ్మోస్ ఒక సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి, దీనిని జలాంతర్గామి, ఓడ, విమానం లేదా భూమి నుంచి ప్రయోగించవచ్చు. బ్రహ్మోస్ రష్యాకు చెందిన పి-800 ఓషియానిక్ క్రూయిజ్ క్షిపణి సాంకేతికతపై ఆధారపడింది. ఈ క్షిపణిని భారత సైన్యం, ఆర్మీ, నేవీ, వైమానిక దళానికి చెందిన మూడు విభాగాలకు అప్పగించారు. బ్రహ్మోస్ క్షిపణికి చాలా వెర్షన్లు ఉన్నాయి. భూ-ప్రయోగ, నౌక-ప్రయోగ, జలాంతర్గామి-గాలి ప్రయోగించిన బ్రహ్మోస్ వెర్షన్‌లను పరీక్షించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం