Adani Case: ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన కేసు.. అదానీ వ్యవహారంపై స్పందించిన భారత ప్రభుత్వం
విద్యుత్ కాంట్రాక్టుల కోసం ముడుపులు ఇచ్చారంటూ అదానీ గ్రూప్ మీద అమెరికా న్యాయవిభాగం చేసిన ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆరోపణలను అదానీ గ్రూప్ ఇప్పటికే తోసిపుచ్చింది. ఈ క్రమంలో అమెరికాలో గౌతమ్ అదానీ కేసుపై భారత ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది.
విద్యుత్ కాంట్రాక్టుల కోసం ముడుపులు ఇచ్చారంటూ అదానీ గ్రూప్ మీద అమెరికా న్యాయవిభాగం చేసిన ఆరోపణల వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఆరోపణలను అదానీ గ్రూప్ ఇప్పటికే తోసిపుచ్చింది.. అయితే.. అదానీ పై కేసు వ్యవహారంపై విపక్షాలు తీవ్రంగా స్పందిస్తున్నాయి. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.. ఈ విషయంపై పార్లమెంట్లో కూడా గళమెత్తాయి. ఈ క్రమంలో అమెరికాలో గౌతమ్ అదానీ కేసుపై భారత ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. ఇది ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు సంబంధించిన కేసు.. అంటూ పేర్కొంది.. ప్రస్తుతం భారత ప్రభుత్వంతో.. అదానీ కేసుకు సంబంధించి ఎలాంటి చట్టపరమైన సంబంధాలు లేవని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
అమెరికాలో గౌతమ్ అదానీపై వచ్చిన లంచం ఆరోపణలపై భారత ప్రభుత్వం తొలిసారిగా స్పందించింది. అభియోగాల నమోదు గురించి అమెరికా వారికి ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వలేదని చెప్పింది. అమెరికా నుంచి తమకు ఎలాంటి సమన్లు, వారెంట్లు అందలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వార్తా సంస్థ ANIతో మాట్లాడుతూ.. ఈ కేసు ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులతో పాటు US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్‌కు సంబంధించిన చట్టపరమైన వివాదం అని తెలిపారు.
#WATCH | Delhi: On the Adani indictment issue, MEA Spokesperson Randhir Jaiswal says, “This is a legal matter involving private firms and individuals and the US Department of Justice. There are established procedures and legal avenues in such cases which we believe would be… pic.twitter.com/w8CCLqU660
— ANI (@ANI) November 29, 2024
“ఈ కేసు గురించి భారత ప్రభుత్వానికి ముందస్తుగా సమాచారం ఇవ్వలేదు. ఈ విషయమై అమెరికా ప్రభుత్వంతో ఎలాంటి చర్చలు జరపలేదు..’ అని రణధీర్ జైస్వాల్ అన్నారు. “వివిధ దేశాల మధ్య పరస్పర చట్టపరమైన అనుకూలత ఉంది. ఇందులో భాగంగా ఎవరైనా వ్యక్తికి సమన్లు లేదా అరెస్ట్ వారెంట్ జారీ చేయమని విదేశీ ప్రభుత్వం చేసిన అభ్యర్థన చేసింది. అలాంటి అప్పీళ్లను వాటి మెరిట్‌లపై పరిశీలిస్తారు. ఈ కేసులో US నుండి మాకు ఎలాంటి అప్పీల్ రాలేదు. ఈ కేసు ప్రైవేట్ సంస్థలకు సంబంధించినది. ఈ దశలో భారత ప్రభుత్వానికి చట్టపరమైన పాత్ర లేదు” అని ఆయన స్పష్టం చేశాడు.
భారత్‌లో సౌర విద్యుత్‌ను విక్రయించే కాంట్రాక్ట్‌ను భారత అధికారులకు లంచం ఇచ్చి గౌతమ్ అదానీ పొందినట్లు యూఎస్ సంచలన వ్యాఖ్యలు చేసింది. US డిపార్ట్‌మెంట్ ఆఫ్ జస్టిస్ న్యూయార్క్‌లోని డిస్ట్రిక్ట్ కోర్ట్‌లో అదానీ గ్రూప్ అనుబంధ సంస్థ అయిన అదానీ గ్రీన్ ఎనర్జీ 20 సంవత్సరాల కాలంలో ఈ కాంట్రాక్టుల నుండి $2 బిలియన్ల(రూ.2,200 కోట్ల) లాభాలను పొందుతుందని ఆరోపించింది. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా 8 మందిపై అభియోగాలు నమోదు చేసినట్లు గత వారం మీడియా కథనాలు తెలిపాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్రిక్ చేయండి