Viral: అలలపై ఇంజనీరింగ్‌ అద్భుతం.. న్యూ పంబన్‌ బ్రిడ్జ్ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..

శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు.. అన్న పాత సినిమా పాట మీకు గుర్తుందా...! ఇప్పుడీ వార్త చూస్తే... అలలపై అద్భుతాలు చేసినారు అంటూ ఆ పాత పాటకి రీమిక్స్‌ అందుకోవాల్సిందే.. నిజంగా.. అలలపై ఇంజనీరింగ్‌ అద్భుతం. అద్దిరిపోయే టెక్నాలజీతో వావ్‌ అనిపిస్తున్న దృశ్యం.

Viral: అలలపై ఇంజనీరింగ్‌ అద్భుతం.. న్యూ పంబన్‌ బ్రిడ్జ్ వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..
New Pamban Bridge
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 29, 2024 | 8:21 PM

శిలలపై శిల్పాలు చెక్కినారు.. మనవాళ్లు సృష్టికే అందాలు తెచ్చినారు.. అన్న పాత సినిమా పాట మీకు గుర్తుందా…! ఇప్పుడీ వార్త చూస్తే… అలలపై అద్భుతాలు చేసినారు అంటూ ఆ పాత పాటకి రీమిక్స్‌ అందుకోవాల్సిందే.. నిజంగా.. అలలపై ఇంజనీరింగ్‌ అద్భుతం. అద్దిరిపోయే టెక్నాలజీతో వావ్‌ అనిపిస్తున్న దృశ్యం. ఇదెక్కడో కాదు.. తమిళనాడు రాష్ట్రంలోని న్యూ పంబన్‌ బ్రిడ్జ్. బ్రిడ్జ్‌ అంటే మామూలు బ్రిడ్జ్‌ కాదు… దేశంలోనే ఫస్ట్‌ వర్టికల్ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జ్. 105 ఏళ్లనాటి వారధి స్థానంలో దీన్ని నిర్మించారు. పాత పంబన్‌ బ్రిడ్జ్‌ తుప్పుపట్టిన కారణంగా దాని సేవలు నిలిచిపోవడంతో… దాని సమీపంలోనే ఈ న్యూ పంబన్‌ బ్రిడ్జ్‌ నిర్మాణం చేపట్టారు. లేటెస్ట్‌ టెక్నాలజీతో ఈ వంతెనను నిర్మించారు.

వావ్‌ అనిపించే ఈ దృశ్యాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అలలపై ఇంజనీరింగ్‌ అదరహో అంటూ కొనియాడారు. పాత, కొత్త పంబన్‌ వంతెనల మధ్య తేడాలను వివరించారు. టెక్నాలజీలోనే కాదు స్పీడ్‌లోనూ అదరగొడుతుందంటూ కొనియాడారు. త్వరలోనే ఈ నయా బ్రిడ్జ్‌ అందుబాటులోకి వస్తుందన్నారు.

వీడియో చూడండి..

రామనాథపురం జిల్లాలో మండపం, రామేశ్వరం ద్వీపం మధ్య 1914లో పంబన్ వంతెనను సముద్రంలో నిర్మించారు. అప్పట్లో దాని నిర్మాణం 20 లక్షలతో పూర్తైంది. 2.6 కి.మీ పొడవైన వంతెనను 2006లో మీటర్ గేజ్ నుంచి బ్రాడ్ గేజ్‌కు మార్చారు. ఈ బ్రిడ్జి మధ్య నుంచి పడవలు, షిప్స్ వెళ్లాలంటే.. 16 మంది కార్మికులు పనిచేస్తేనే వంతెన తెరుచుకుంటుంది. ఇప్పుడు అలా కాకుండా ఏకంగా ట్రాక్ ఉన్న వంతెనను పూర్తిగా పైకి లిఫ్ట్ చేసేలా అధునాతన సాంకేతికతను జోడించారు. 2019 మార్చిలో ఈ కొత్త పంబన్ బ్రిడ్జికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేశారు.

అశ్విని వైష్ణవ్ ట్వీట్..

సముద్రంలో ఓడలు వంతెన దగ్గరకు వస్తే ఆటోమేటిక్‌గా బ్రిడ్జి పైకి లేస్తుంది. ఇలా సముద్రంపై నిర్మితమైన తొలి వర్టికల్ రైల్వే బ్రిడ్జి ఇదే కావడం విశేషం..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..