UCPMP: ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్‌ కోడ్‌ తెచ్చిన కేంద్రం.. డాక్టర్లకు గిఫ్ట్‌లు, జర్నీ టిక్కెట్లు, నగదు ఇవ్వడంపై నిషేధం

ఫార్మా కంపెనీల అనైతిక చర్యలను అరికట్టేందుకు కేంద్రం కొత్త మార్కెటింగ్‌ కోడ్‌ను తెరపైకి తెచ్చింది. తమ ఉత్పత్తులను భాగా రాసిన.. సేల్ చేసిన మెడికల్‌ ఏజెన్సీలకు, డాక్టర్లకు కొన్ని ఫార్మా కంపెనీలు విదేశీ టూర్లకు సంబంధించి టిక్కెట్లు గానీ.. నగదు గానీ ఇస్తుంటాయి. ఇలా రకరకాల గిఫ్టులు తీసుకున్న డాక్టర్లు ఆయా కంపెనీల మందులు సేల్‌ అయ్యేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు.

UCPMP: ఫార్మాస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్‌ కోడ్‌ తెచ్చిన కేంద్రం.. డాక్టర్లకు గిఫ్ట్‌లు, జర్నీ టిక్కెట్లు, నగదు ఇవ్వడంపై నిషేధం
Pharma Uniform Code
Follow us
Surya Kala

|

Updated on: Mar 14, 2024 | 6:23 AM

సాధారణంగా ఫార్మా కంపెనీలు.. వాటి ఉత్పత్తులను ప్రమోట్‌ చేసుకునేందుకు రకరకాల చర్యలు తీసుకుంటూ ఉంటాయి. ఆయా కంపెనీల మందులు.. క్లినిక్స్‌లో.. ఆస్పత్రుల్లో, డిస్టిబ్యూటర్ పాయింట్స్‌లో ఎక్కువగా సేల్‌ అయ్యేందుకు.. డాక్టర్లు విరివిగా ప్రిస్కిప్షన్‌లో రాసేందుకు గాను ప్రత్యేక బహుమతులు ఇస్తుంటాయి. తమ ఉత్పత్తులను భాగా రాసిన.. సేల్ చేసిన మెడికల్‌ ఏజెన్సీలకు, డాక్టర్లకు కొన్ని ఫార్మా కంపెనీలు విదేశీ టూర్లకు సంబంధించి టిక్కెట్లు గానీ.. నగదు గానీ ఇస్తుంటాయి. ఇలా రకరకాల గిఫ్టులు తీసుకున్న డాక్టర్లు ఆయా కంపెనీల మందులు సేల్‌ అయ్యేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తుంటారు. ఆయా ఫార్మా కంపెనీలు ప్రత్యేక రిప్రజెంట్లను నియమించుకుని వారి ద్వారా ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడుతుంటాయి. దీని ద్వారా మెడిసిన్‌ నాణ్యత విషయంలో వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు రాజీ పడాల్సి వస్తుంది.

ఇలాంటి వాటికి కొత్తగా తీసుకొచ్చిన యూనిఫామ్‌ కోడ్‌తో అడ్డుకట్ట వేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే.. ఫార్మా కంపెనీలు ఆరోగ్య సంరక్షణ నిపుణులు, లేదా వారి కుటుంబ సభ్యులకు బహుమతులు, ప్రయాణ సౌకర్యాలను అందించడాన్ని నిషేధించబడనుంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ జారీ చేసిన యూనిఫాం కోడ్ ఫర్ ఫార్మాస్యూటికల్స్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్ (UCPMP-2024) ఉత్పత్తిని సూచించడానికి అర్హత లేని వారికి ఫ్రీ శాంపిల్స్‌ను సరఫరా చేయడాన్ని అడ్డుకుంటుంది. ఇకపై.. మందులు గురించిన సమాచారం అందరికీ తెలిసేలా వైద్యులు కృషి చేయాల్సి ఉంటుంది. ప్రత్యక్షంగానీ.. పరోక్షంగా గానీ ఫార్మా కంపెనీలు వైద్యులను, ఆరోగ్య సంరక్షణ నిపుణులను తప్పుదారి పట్టించకూడదు.

ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో పనిచేస్తున్న ఇతర వృత్తుల సభ్యులతో సహా వైద్య, ఫార్మసీ వృత్తులకు ఈ నూతన కోడ్‌ రూల్స్‌ వర్తించనున్నాయి. ఈ కోడ్‌ అమలు చేయడం ద్వారా.. ఏదైనా ఫార్మా కంపెనీకి చెందిన ఏజెంట్, పంపిణీదారులు, హోల్‌సేలర్లు, రిటైలర్లు, వైద్యులు, ఆరోగ్య సంరక్షణ నిపుణులు, లేదా వారి కుటుంబ సభ్యుల వ్యక్తిగత ప్రయోజనం కోసం ఎలాంటి బహుమతులు ఇవ్వడాన్ని అడ్డుకుంటుంది. ఏజెంట్, డిస్ట్రిబ్యూటర్లు, హోల్‌సేలర్లు, రిటైలర్ల ద్వారా మందులను సూచించడానికి, సరఫరా చేయడానికి ఎలాంటి గిఫ్ట్‌లు అందించకుండా చర్యలు తీసుకుంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
టీమిండియా ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. వాళ్లకు ఇదే చివరి టోర్నీ?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీలోకి ఆర్‌ఆర్ఆర్ డాక్యుమెంటరీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
యుముడు ఫాలో అవుతున్నాడంటే.. మీరు తప్పు చేసినట్లే.. జర జాగ్రత్త..
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
భారతదేశంలో అత్యంత చౌకైన కార్లు.. రూ.3.99 లక్షల నుండి ప్రారంభం!
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
చోరీ చేసి కారులో పారిపోతుండగా ప్రమాదం..తీరా ఏమైందో అని..
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..