Gold Price Today: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గోల్డ్ ధరలు 66 వేల రూపాయల మార్క్ దాటాయి. ముఖ్యంగా ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిణామాలు బంగారం ధరల్ని శాసిస్తాయి. ఇంకా ద్రవ్యోల్బణం, షేర్ మార్కెట్.. పెట్టుబడులు ఇవన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఇంకా.. పెళ్లిళ్ల సీజన్ మొదలు కాక ముందే.. ధరతో ప్రమేయం లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి.
బంగారం ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గోల్డ్ ధరలు 66 వేల రూపాయల మార్క్ దాటాయి. ముఖ్యంగా ప్రపంచ భౌగోళిక, రాజకీయ పరిణామాలు బంగారం ధరల్ని శాసిస్తాయి. ఇంకా ద్రవ్యోల్బణం, షేర్ మార్కెట్.. పెట్టుబడులు ఇవన్నీ బంగారం ధరలపై ప్రభావం చూపుతాయి. ఇంకా.. పెళ్లిళ్ల సీజన్ మొదలు కాక ముందే.. ధరతో ప్రమేయం లేకుండా అమ్మకాలు జరుగుతున్నాయి. ఇప్పుడే ధరలు ఇలా ఉంటే.. పూర్తిస్థాయిలో పెళ్లిళ్ల సీజన్ నాటికి పరిస్థితి ఏంటి? అని బెంబేలెత్తిపోతున్నారు జనం. వాస్తవానికి రెండేళ్లుగా బంగారం ధర స్థిరంగా లేదు. గతేడాది ఇదే సమయానికి 60 వేలు దాటితే.. ఇప్పుడు 66 వేల మార్క్ క్రాస్ చేసింది. 2018లో 30వేలున్న పది గ్రాముల పసిడి ధర.. ఆరేళ్లు గడిచేసరికి రెండింతలైంది. వాస్తవానికి ప్రతిరోజూ బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే గురువారం ( మార్చి 14, 2024) ధరలు స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల బంగారంపై రూ.10, కిలో వెండిపై రూ.100 మేర ధర తగ్గింది. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకోండి..
ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ..
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.60,490, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.65,980 గా ఉంది.
ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,340, 24 క్యారెట్ల ధర రూ.65,830
బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ.60,340, 24 క్యారెట్ల స్వర్ణం ధర రూ.65,830
చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.61,060, 24 క్యారెట్ల రేటు రూ.66,640
కేరళలో 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ.60,340, 24 క్యారెట్ల ధర రూ.65,830
హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.60,340, 24 క్యారెట్ల ధర రూ.65,830
విజయవాడ 22 క్యారెట్ల 10గ్రా రేటు రూ.60,340, 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.65,830
విశాఖపట్నం 22 క్యారెట్ల గోల్డ్ పది గ్రాముల ధర రూ.60,340, 24 క్యారెట్ల రేటు రూ.65,830గా ఉంది.
వెండి ధరలు
- చెన్నైలో వెండి కిలో ధర రూ.78,400
- ముంబైలో రూ.75100
- ఢిల్లీలో రూ.75,100
- బెంగళూరులో రూ.74,400
- కేరళలో రూ.78,400
- హైదరాబాద్‌లో రూ.78,400
- విజయవాడలో రూ.78400
- విశాఖపట్నంలో రూ.78,400
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..